National

Smriti Mandhana: చిన్నారుల హక్కులకై మంధాన ముందడుగు.. సచిన్ టెండూల్కర్ ప్రశంసలు!

రచన: Mahesh••4 నిమిషాల పఠనం

Smriti Mandhana: భారత మహిళా క్రికెట్ జట్టు పగ్గాలు చేపట్టిన స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన గ్రౌండ్ బయట కూడా తన పెద్ద మనసును చాటుకున్నారు. కేవలం బ్యాట్‌తో పరుగుల వరద పారించడమే కాకుండా, సమాజంలో మార్పు కోసం కీలక అడుగు వేశారు. పిల్లల హక్కులు, లింగ సమానత్వం లక్ష్యంగా ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ‘యూనిసెఫ్ ఇండియా’ సెలెబ్రిటీ అడ్వకేట్‌గా ఆమె అధికారికంగా నియమితులయ్యారు.

Smriti Mandhana: భారత మహిళా క్రికెట్ జట్టు పగ్గాలు చేపట్టిన స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన గ్రౌండ్ బయట కూడా తన పెద్ద మనసును చాటుకున్నారు. కేవలం బ్యాట్‌తో పరుగుల వరద పారించడమే కాకుండా, సమాజంలో మార్పు కోసం కీలక అడుగు వేశారు. పిల్లల హక్కులు, లింగ సమానత్వం లక్ష్యంగా ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ‘యూనిసెఫ్ ఇండియా’ సెలెబ్రిటీ అడ్వకేట్‌గా ఆమె అధికారికంగా నియమితులయ్యారు. దేశంలోని ప్రతీ బాలికకు సమాన అవకాశాలు దక్కాలని, వారి భవిష్యత్తుకు భరోసా కల్పించాలనే సంకల్పంతో మంధాన ఈ నూతన బాధ్యతలను స్వీకరించారు.

యూనిసెఫ్‌లోకి స్వాగతించిన మాస్టర్ బ్లాస్టర్

చిన్నారుల సంక్షేమం కోసం మంధాన వేసిన ఈ ముందడుగుపై క్రికెట్ దిగ్గజం, భారత రత్న సచిన్ టెండూల్కర్ ప్రశంసల జల్లు కురిపించారు. ఎన్నో ఏళ్లుగా యూనిసెఫ్‌తో కలిసి చిన్నారుల హక్కుల కోసం పనిచేస్తున్న సచిన్, మంధానను సంస్థలోకి సాదరంగా ఆహ్వానించారు. మైదానంలో కోట్లాది మంది యువతకు రోల్ మోడల్‌గా నిలిచిన మంధాన.. ఇకపై గ్రౌండ్ బయట కూడా చిన్నారుల గొంతుకగా మారి వారి హక్కుల పరిరక్షణకు శక్తివంతంగా నిలబడతారనే పూర్తి నమ్మకం ఉందని ఆయన ఆకాంక్షించారు.

కలల సాకారానికి ‘అమ్మాయి’ అనే కారణం అడ్డుకాకూడదు

ఈ సందర్భంగా మంధాన తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. తొమ్మిదేళ్ల వయసులో అన్నయ్యతో కలిసి సరదాగా క్రికెట్ ట్రయల్స్‌కు వెళ్లిన రోజులను ప్రస్తావిస్తూ.. కుటుంబ ప్రోత్సాహం వల్లే ఈ స్థాయికి చేరుకున్నానని చెప్పారు. నాన్న ఆటను ప్రోత్సహిస్తే, అమ్మ చదువుకు ఆటకు మధ్య బ్యాలెన్స్ దెబ్బతినకుండా చూసుకున్నారని గుర్తుచేసుకున్నారు. స్వతంత్రంగా ఎంచుకున్న మార్గంలో పయనించి ఈరోజు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నానని చెబుతూ.. సమాజంలో ఏ రంగంలో ఎదగాలన్నా ‘అమ్మాయి’ అనే కారణం ఎవరికీ అడ్డంకి కారాదని, ప్రతీ బాలికకు తన కలలను నిజం చేసుకునే పూర్తి స్వేచ్ఛ ఉండాలని ఆమె బలంగా స్పష్టం చేశారు.

#Smriti Mandhana#Sachin Tendulkar#UNICEF India#UNICEF Celebrity Advocate#Indian Women’s Cricket#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి