తెలంగాణ

KCR: సర్‌పై సార్ గప్‌చుప్.. ‘దేశ్ కీ నేత’ మౌనం వెనుక మతలబేంటి?

రచన: Mahesh••5 నిమిషాల పఠనం

KCR: "తెలంగాణే కాదు.. యావత్ దేశాన్ని మార్చేస్తాం.. దేశ్ కీ నేతగా ఢిల్లీ పీఠాన్ని కదిలిస్తాం!" అంటూ గులాబీ జెండాను జాతీయ స్థాయికి తీసుకెళ్లిన మాజీ సీఎం కే.చంద్రశేఖర రావు ఇప్పుడు ఎక్కడ? దేశ రాజధాని వేదికగా ఎన్నికల కమిషన్ తీరుపై, 13 కోట్ల ఓట్ల గల్లంతుపై సమస్త విపక్షాలు ఏకమై పోరాడుతుంటే.. జాతీయ రాజకీయాలను శాసిస్తానన్న కేసీఆర్ ఎందుకు ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారు? ఢిల్లీ నుండి గల్లీ దాకా ప్రజాస్వామ్య ఉద్యమం హోరెత్తుతుంటే, దేశ్ కీ నేత నోటికి తాళం పడటం వెనుక అసలు మతలబు ఏంటనేది

KCR: "తెలంగాణే కాదు.. యావత్ దేశాన్ని మార్చేస్తాం.. దేశ్ కీ నేతగా ఢిల్లీ పీఠాన్ని కదిలిస్తాం!" అంటూ గులాబీ జెండాను జాతీయ స్థాయికి తీసుకెళ్లిన మాజీ సీఎం కే.చంద్రశేఖర రావు ఇప్పుడు ఎక్కడ? దేశ రాజధాని వేదికగా ఎన్నికల కమిషన్ తీరుపై, 13 కోట్ల ఓట్ల గల్లంతుపై సమస్త విపక్షాలు ఏకమై పోరాడుతుంటే.. జాతీయ రాజకీయాలను శాసిస్తానన్న కేసీఆర్ ఎందుకు ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారు? ఢిల్లీ నుండి గల్లీ దాకా ప్రజాస్వామ్య ఉద్యమం హోరెత్తుతుంటే, దేశ్ కీ నేత నోటికి తాళం పడటం వెనుక అసలు మతలబు ఏంటనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

కేంద్ర దర్యాప్తు సంస్థల భయమే కేసీఆర్‌ను కట్టడి చేస్తోందా?

అఖిలపక్షాలు పార్టీ జెండాలను పక్కనపెట్టి నిరసన గళం విప్పుతుంటే, కేసీఆర్ మాత్రం కనీసం ఒక్క ప్రెస్‌మీట్ పెట్టే సాహసం కూడా చేయకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. కేవలం కేటీఆర్ ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్టుతో చేతులు దులుపుకోవడం గులాబీ బాస్ మార్క్ రాజకీయానికి పూర్తి భిన్నం. "కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ, ఈడీ దర్యాప్తు కత్తి తలపై వేలాడుతుండటంతోనే కేసీఆర్ అడుగు ముందుకు వేయడం లేదా? మోడీ, అమిత్ షాల వైఖరిపై బహిరంగంగా నోరెత్తితే కుటుంబం మొత్తం కటకటాలపాలవుతుందనే వణుకుతోనే ఆయన గప్‌చుప్‌గా ఉండిపోయారా?" అన్న విమర్శలకు ఈ మౌనం మరింత ఊతమిస్తోంది. తెరవెనుక బీజేపీ పెద్దలతో గులాబీ బాస్ ఏదైనా లోపాయికారీ అవగాహనకు వచ్చారా అన్న సందేహాలు బలంగా వ్యక్తమవుతున్నాయి.

బాపు రాజకీయం ఎటో అర్థంకాక క్యాడర్ అయోమయం!

ఢిల్లీలో భారీ పార్టీ కార్యాలయం కట్టి, పొరుగు రాష్ట్రాల్లో నేతలకు గులాబీ కండువాలు కప్పిన కేసీఆర్.. దేశవ్యాప్తంగా ఇంతటి చారిత్రక ప్రజా పోరాటం జరుగుతున్న సమయంలో ఈసీ ముందు తలపెట్టిన చిన్న ధర్నాను కూడా వాయిదా వేయించడం సొంత పార్టీ శ్రేణులకే మింగుడుపడటం లేదు. బెంగాల్‌లో 90 లక్షలు, బీహార్‌లో 60 లక్షల ఓట్లు పోయాయని సమాచారం వస్తుంటే, రేపు తెలంగాణలోనూ ఓట్లు గల్లంతైతే పరిస్థితి ఏంటన్న ఆందోళన నాయకుల్లో కనిపిస్తోంది. కానీ బాయికాడ కూర్చున్న బాపు మాత్రం బయటకు రాకపోవడం, కాంగ్రెస్ నడుపుతున్న పోరాటంలో క్రెడిట్ రాదనే అలసత్వంతో మిన్నకుండిపోవడం కేసీఆర్ జాతీయ నాయకత్వ ఇమేజ్‌నే తీవ్రంగా దెబ్బతీస్తోందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

#KCR#K Chandrashekar Rao#BRS#Telangana Politics#National Politics#Election Commission#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి