తెలంగాణ

Telangana Politics: హరీష్ అడ్డాపై రేవంత్ కన్ను.. గులాబీ కోటలో పోటాపోటీ రచ్చ!

రచన: Mahesh•••4 నిమిషాల పఠనం

Telangana Politics: సిరిసిల్లలో కేటీఆర్‌కు చెక్ పెట్టిన జోష్‌లో ఉన్న కాంగ్రెస్.. ఇప్పుడు బీఆర్‌ఎస్‌కు అత్యంత పటిష్టమైన కంచుకోట సిద్దిపేటపై దృష్టి సారించింది. మాజీ మంత్రి హరీష్ రావు స్వంత ఇలాకాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభకు రంగం సిద్ధమవుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది.

Telangana Politics: సిరిసిల్లలో కేటీఆర్‌కు చెక్ పెట్టిన జోష్‌లో ఉన్న కాంగ్రెస్.. ఇప్పుడు బీఆర్‌ఎస్‌కు అత్యంత పటిష్టమైన కంచుకోట సిద్దిపేటపై దృష్టి సారించింది. మాజీ మంత్రి హరీష్ రావు స్వంత ఇలాకాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభకు రంగం సిద్ధమవుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. సిద్దిపేటలో గులాబీ జెండాను పీకేసి కాంగ్రెస్ జెండా ఎగరేసిన నేతకు ఏకంగా మంత్రి పదవి ఇస్తానంటూ గతంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన ఓపెన్ ఆఫర్‌ను గుర్తుచేస్తూ హస్తం శ్రేణులు కదనరంగానికి దిగుతున్నాయి.

రేవంత్ సభకు ముందే హరీష్ రావు మాస్టర్ ప్లాన్!

సీఎం రేవంత్ రెడ్డి సభ ఖరారయ్యేలోపే తన పట్టును నిరూపించుకునేందుకు హరీష్ రావు శరవేగంగా పావులు కదిపారు. సిద్దిపేట జిల్లా ఏర్పడి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ‘దశాబ్ది ఉత్సవాల’ పేరిట మూడు రోజుల పాటు భారీ కార్యక్రమాలను ప్రకటించారు. ఈ నెల 11న నిర్వహించనున్న భారీ బహిరంగ సభ ద్వారా సిద్దిపేట అంటే తిరుగులేని గులాబీ అడ్డా అని అధికార పక్షానికి ముందే వార్నింగ్ ఇచ్చేలా ప్లాన్ చేశారు. రాష్ట్రంలో 33 జిల్లాలు ఉంటే కేవలం సిద్దిపేటలోనే దశాబ్ది ఉత్సవాలు ఎందుకని కాంగ్రెస్ ప్రశ్నిస్తుండగా.. సిద్దిపేట ప్రగతి తమ చెమట చుక్కల ఫలితమని, ఎంతమంది వచ్చినా ఈ కోటను తాకలేరని బీఆర్‌ఎస్ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

ఎర్రవెల్లి భూముల సర్వే సెగ..

ఓవైపు ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్ భూములపై కొనసాగుతున్న సర్వే వ్యవహారం అగ్గి రాజేస్తుండగానే, మరోవైపు సిద్దిపేట వేదికగా ఇరు పార్టీల సభల పోటీ హీటెక్కిస్తోంది. ఒకే కుటుంబ గుత్తాధిపత్య పాలనకు ముగింపు పలకడమే తమ లక్ష్యమని కాంగ్రెస్ గర్జిస్తుంటే.. తమది కూల్చే నైజం కాదు, అభివృద్ధిని నిలబెట్టే తత్వమంటూ హరీష్ దళం కౌంటర్ ఇస్తోంది. సిరిసిల్ల సభ సక్సెస్‌తో దూకుడు మీదున్న రేవంత్ సర్కార్.. హరీష్ ఇలాకాలో ఎలాంటి పొలిటికల్ బాంబు పేల్చబోతోందనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠభరితంగా మారింది.

#Telangana Politics#Revanth Reddy#Harish Rao#Siddipet Politics#BRS#Congress#KTR#KCR#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి