తెలంగాణ

Revanth Reddy: ప్రమోద్ కాదు.. ప్రాపర్టీ సావంత్.. గోవా సీఎంపై రేవంత్ రెడ్డి సెటైర్!

రచన: Mahesh••4 నిమిషాల పఠనం

Revanth Reddy: గోవా రాజకీయాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన పంచ్ డైలాగ్స్ ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గోవా సీఎం ప్రమోద్ సావంత్‌ను నేరుగా టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి చేసిన ‘ప్రాపర్టీ సావంత్’ కామెంట్ స్థానిక రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా కాక రేపింది. బీజేపీ పాలనలో గోవాలో వేలాది ఎకరాల భూములు అన్యాక్రాంతమైపోతున్నాయని, ప్రజల ఆస్తులను దోచుకుంటున్నారని ఆరోపించిన రేవంత్.. బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలపై నిప్పులు చెరిగారు.

గోవాను డ్రగ్స్ అడ్డాగా మార్చేశారు

గోవా పర్యటనలో భాగంగా నిర్వహించిన ‘గోయ్ రాఖోన్న్’ యాత్రలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. "గోవా భవిష్యత్తును పూర్తిగా నాశనం చేశారు. యువతను డ్రగ్స్‌కు బానిసలుగా మార్చేసి, రాష్ట్రాన్ని డ్రగ్స్ పెడ్లర్లకు అడ్డాగా మార్చేశారు. రెండుసార్లు బీజేపీని నమ్మి ప్రజలు మోసపోయారు.. మూడోసారి కూడా ఆ పార్టీని నమ్మి మళ్లీ మోసపోవద్దు" అని పిలుపునిచ్చారు.

ఓటర్ల జాబితా నుంచి పేదల ఓట్ల తొలగింపు

దేశంలో ఎన్నికల ప్రక్రియ సాగుతున్న తీరుపైనా రేవంత్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఓటర్ల జాబితా నుంచి దళితులు, గిరిజనులు, మైనారిటీలు, నిరుపేదల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగిస్తున్నారని విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ పేర్లను నేరుగా ప్రస్తావిస్తూ ఆయన చేసిన కామెంట్స్ జాతీయ స్థాయిలోనూ చర్చనీయాంశంగా మారాయి. ఢిల్లీలో కొనసాగుతున్న నిరసన కార్యక్రమాల వల్ల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గోవా పర్యటనకు రాలేకపోయారని, ఆయన తరఫున తాను ఇక్కడికి వచ్చానని రేవంత్ స్పష్టం చేశారు. గోవా ప్రయోజనాలు కాపాడబడాలంటే తమ పార్టీ అధికారంలోకి రావాలని, బీజేపీ దోపిడీ పాలనకు చరమగీతం పాడి కాంగ్రెస్‌కు పట్టం కట్టాలని స్థానిక ప్రజలను కోరారు. భూముల ఆక్రమణలు, డ్రగ్స్ మాఫియా, ఓటర్ల జాబితా గోల్‌మాల్‌పై రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ గోవా రాజకీయాల్లో తీవ్ర దుమారానికి దారితీశాయి.

#Revanth Reddy#Pramod Sawant#Property Sawant#Goa Politics#Telangana Politics#Congress#BJP#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి