National

ఇండియా కూట‌మి సంచ‌ల‌న నిర్ణ‌యం.. రాహుల్‌, ఖ‌ర్గే కీల‌క వ్యాఖ్య‌లు!

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ, ఈవీఎంల వినియోగంపై కేంద్ర ఎన్నికల సంఘంతో కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో ప్రతిపక్ష 'ఇండియా కూటమి సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయంగా అక్టోబర్ 2 (గాంధీ జయంతి) నుంచి అక్టోబర్ 8 వరకు వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా 'సేవ్ డెమోక్రసీ మార్చ్' పేరుతో నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు కూటమి అగ్రనేతలు ప్రకటించారు.

ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ, ఈవీఎంల వినియోగంపై కేంద్ర ఎన్నికల సంఘంతో కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో ప్రతిపక్ష 'ఇండియా కూటమి సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయంగా అక్టోబర్ 2 (గాంధీ జయంతి) నుంచి అక్టోబర్ 8 వరకు వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా 'సేవ్ డెమోక్రసీ మార్చ్' పేరుతో నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు కూటమి అగ్రనేతలు ప్రకటించారు. ఈ క్రమంలోనే వివాదాస్పద నిర్ణయాలకు బాధ్యత వహిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వారు గట్టిగా డిమాండ్ చేశారు.

న్యూఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో సమావేశమైన కూటమి నేతలు రాబోయే ఆందోళన కార్యక్రమాల రూపురేఖలను ఖరారు చేశారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వివరాలను వెల్లడిస్తూ.. అక్టోబర్ 2 నుంచి 8 వరకు దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో 'సేవ్ డెమోక్రసీ' ప్రదర్శనలు చేపడతామని తెలిపారు. దీనితో పాటు అక్టోబర్ 6న ప్రతిపక్ష ఎంపీలందరితో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం (నిర్వాచన్ సదన్) వరకు భారీ పాదయాత్ర నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ఎన్నికల సంఘం తీరుపై వినతిపత్రం అందజేయనున్నట్లు పేర్కన్నారు.

ఇదే సమావేశంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. భారత ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు ఇండియా కూటమి నాయకులందరూ వ్యక్తిగతంగా కట్టుబడి ఉన్నారని పునరుద్ఘాటించారు. దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించే వారు ఎంతటి ఉన్నత పదవుల్లో ఉన్నా వదిలేది లేదని, చట్టప్రకారం వారందరికీ శిక్ష పడేలా చేస్తామని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. వ్యవస్థల కంటే భారత ప్రజాస్వామ్యమే అత్యంత గొప్పదని ఆయన స్పష్టం చేశారు.

ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని, పారదర్శకత లేని ఈవీఎంల విధానాన్ని పక్కనబెట్టి రాబోయే ఎన్నికల్లో పాత పద్ధతిలోనే బ్యాలెట్ పేపర్లను వినియోగించాలని ఇండియా కూటమి నేతలు మరోసారి డిమాండ్ చేశారు. గాంధీ జయంతి నాటి నుంచి ప్రారంభమయ్యే ఈ వారం రోజుల ఆందోళన కార్యక్రమాలతో దేశవ్యాప్తంగా రాజకీయ వాతావరణం మరింత వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

#INDIABloc#SaveDemocracyMarch#ElectionCommission#GyaneshKumar#RahulGandhi#MallikarjunKharge#IndianPolitics#BallotPaperDemand
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి