#NC25: అక్కినేని నాగచైతన్య కెరీర్‌లో మరో మైల్ స్టోన్ మూవీకి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం, వరుస సినిమాలతో బిజీగా ఉన్న చైతూ.. తన 25వ సినిమాను ఎప్పుడు ప్రకటిస్తారన్న ఆసక్తి అక్కినేని అభిమానుల్లో నెలకొంది. అయితే, ఈ స్పెషల్ ప్రాజెక్ట్ ప్రకటన విషయంలో మేకర్స్ ఓ ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నట్లు తాజాగా క్లారిటీ ఇచ్చారు. మేము అధికారికంగా ప్రకటన ఇచ్చే వరకూ సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను నమ్మొద్దు..అంటూ చైతూ పీఆర్ టీమ్ స్పష్టం చేసింది.
ప్రస్తుతం, చైతూ నటిస్తున్న ‘వృషకర్మ’ సినిమా విడుదలైన తర్వాతే..ఆయన 25వ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇవ్వనున్నారు. చైతూ కెరీర్‌లో రాబోతున్న 25వ సినిమా కావడంతో స్పెషల్‌గా ఉండేలా నాగార్జున ప్లాన్ చేస్తున్నాడు. దాదాపుగా, ఈ ప్రాజెక్ట్‌ను నాగ్ తన సొంత నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్‌పై నిర్మించే అవకాశాలున్నాయి.
చైతన్య కెరీర్‌లో 25వ సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై సహజంగానే అంచనాలు పెరుగుతున్నాయి. సాధారణ సినిమాల మాదిరిగా కాకుండా.. తన కెరీర్‌లో గుర్తుండిపోయేలా ఈ సినిమాను ప్లాన్ చేయాలని చైతూ కూడా భావిస్తున్నట్లు సమాచారం. అందుకే.. కథ, దర్శకుడు, నిర్మాణ సంస్థ వంటి అంశాలపై పూర్తి క్లారిటీ వచ్చిన తర్వాతే అధికారిక ప్రకటన చేయాలని చూస్తున్నారట.
వృషకర్మ మూవీపైనే ఫుల్ ఫోకస్..
ప్రస్తుతం చైతూ దృష్టి మొత్తం ‘వృషకర్మ’ సినిమాపైనే ఉందని తెలుస్తోంది. ఈ సినిమా విడుదలకు ముందే మరో ప్రాజెక్ట్‌ను ప్రకటిస్తే.. ప్రమోషన్స్‌పై ప్రభావం పడే అవకాశం ఉండటంతో 25వ సినిమాను కొంతకాలం సస్పెన్స్‌లో ఉంచుతున్నట్లు టాక్. ‘వృషకర్మ’ రిలీజ్ తర్వాత చైతూ నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. కార్తీక్ వర్మ దండు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి నటిస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ 4న భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. బహుషా 2027 సంక్రాంతికి చైతూ 25వ సినిమా ప్రకటన ఉండే అవాకాశం ఉంది.


