తెలంగాణ

TG : కాంగ్రెస్‌ను స్థాపించింది బిట్రీష్ వాడు..‘డివైడ్ అండ్ రూల్’ దాని సిద్ధాంతం : రఘునందన్ రావు

రచన: Kumar••4 నిమిషాల పఠనం

దేవుళ్ల మీద సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఘాటుగా స్పందించారు. రాముడు ధనవంతుల దేవుడు అయితే భద్రచాలం రామయ్య వద్దకు తన సతీమణితో కోలిసి సీఎం ఎందుకు తలంబ్రాలు తీసుకువెళ్లారో సమాధానం చెప్పాలన్నారు.

దేవుళ్ల మీద సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఘాటుగా స్పందించారు. రాముడు ధనవంతుల దేవుడు అయితే భద్రచాలం రామయ్య వద్దకు తన సతీమణితో కోలిసి సీఎం ఎందుకు తలంబ్రాలు తీసుకువెళ్లారో సమాధానం చెప్పాలన్నారు. తాము ద్రవిడులం, శివుడిని కొలుస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి.. ఎప్పుడైనా శ్రీశైలం వెళ్లారా? కొమురవెల్లి మల్లన్నకు ఏమైనా చేశారా? అని రఘునందన్ రావు ప్రశ్నించారు.

ఇక కాంగ్రెస్ పార్టీని స్థాపించింది బ్రిటీష్ వ్యక్తి అని.. బ్రిటీష్ వారు చెప్పినట్టు ‘డివైడ్ అండ్ రూల్’ ప్రకారమే ఆ పార్టీ నడుస్తుందని వివరించారు. చివరకు దేవుళ్లను విభజించాలనే రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలకు తాము చింతిస్తున్నట్టు పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలో మీడియాతో ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. ప్రధాని మోడీ అనేక సందర్భాల్లో శైవక్షేత్రాలను సందర్శించారని ‘హర హర మహాదేవ నినాదం’ గురించి తమకు నేర్పించాల్సిన అవసరం లేదని హితవు పలికారు.

గతంలో కేసీఆర్ గజ్వేల్‌కు మాత్రమే సీఎంలా వ్యవహరిస్తే.. రేవంత్ రెడ్డి మూడేళ్లుగా కొడంగల్ సెగ్మెంటుగా సీఎంగా వ్యవహరిస్తున్నారని సెటైర్లు వేశారు. నిధులు, ప్రాజెక్టులు అన్నీ కొండకల్‌కే తరలించుకుపోతున్నారని.. ముఖ్యమంత్రికి ఇప్పటికైనా రాష్ట్రంలో సిరిసిల్ల అనే మరో నియోజకవర్గం ఉందని గుర్తుకురావడం సంతోషకరమని వెల్లడించారు.

రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాలను సీఎం రేవంత్ రెడ్డి సమానంగా చూడాలని.. రాజకీయాల కోసం ఓ నియోజకవర్గం మీద దండయాత్ర చేస్తానని చెబితే అది బీఆర్ఎసైనా, కాంగ్రెసైనా తెలివితక్కువ తనం అవుతుందని తెలిపారు.రేవంత్ రెడ్డికి చేతనైతే రింగ్ రోడ్డు టెండర్ల కేసు, ఫార్ములా ఈ కార్ కేసులోనో కేటీఆర్‌ను జైల్లో వేయాలి తప్ప వంద కార్లు వేసుకుని దండయాత్ర చేస్తానని వెళ్లడం సరైంది కాదన్నారు.ఇదిలాఉండగా, అక్టోబర్ 4న కేంద్ర హోంమంత్రి మెదక్ పార్లమెంట్ పరిధిలోని తూప్రాన్‌లో అమూల్ భారీ మిల్క్‌ బల్క్‌ యూనిట్ శంకుస్థాపనకు రాబోతున్నారని పేర్కొన్నారు.

#mp raghunandanrao#revanth reddy#ramudu#shivudu#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి