సినిమా

Nagarjuna: ‘కింగ్ 100’లో విలన్‌గా అశోక్ సెల్వన్!

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Nagarjuna: టాలీవుడ్ మన్మధుడు, కింగ్ నాగార్జున ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అందులో ముఖ్యంగా ఆయన నటిస్తున్న ‘కింగ్ 100’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇది నాగ్ నటిస్తోన్న వందవ సినిమా కావడం విశేషం. ఈ మైల్ స్టోన్ మూవీకి తమిళ యువ దర్శకుడు రా.కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో నాగార్జునను సరికొత్త యాక్షన్ అవతార్‌లో చూపించేందుకు మేకర్స్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

Nagarjuna: టాలీవుడ్ మన్మధుడు, కింగ్ నాగార్జున ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అందులో ముఖ్యంగా ఆయన నటిస్తున్న ‘కింగ్ 100’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇది నాగ్ నటిస్తోన్న వందవ సినిమా కావడం విశేషం. ఈ మైల్ స్టోన్ మూవీకి తమిళ యువ దర్శకుడు రా.కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో నాగార్జునను సరికొత్త యాక్షన్ అవతార్‌లో చూపించేందుకు మేకర్స్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమాలో విలన్ పాత్రకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. కింగ్ 100 లో తమిళ నటుడు విలన్‌గా అశోక్ సెల్వన్ ఎంపికైనట్టుగా సమాచారం.

విలన్‌గా అశోక్ సెల్వన్?

తమిళ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు అశోక్ సెల్వన్.. ‘కింగ్ 100’లో కీలకమైన నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడనే టాక్ ప్రస్తుతం అంతటా వినిపిస్తోంది. ఇప్పటివరకు హీరోగా, విభిన్నమైన పాత్రల్లో కనిపించిన అశోక్ సెల్వన్.. నాగార్జునకు ప్రత్యర్థిగా కనిపిస్తే ఈ కాంబినేషన్ సినిమాకు మరింత క్రేజ్ తీసుకురావడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే, అశోక్ సెల్వన్ పాత్ర పూర్తిస్థాయి విలన్‌గానా, లేక కథలో కీలకమైన ట్విస్ట్‌తో కూడిన గ్రే షేడ్స్ క్యారెక్టర్‌గా ఉంటుందా అనే విషయం మాత్రం ఇంకా అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ఇక, ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. నాగ్ సరసన సీనియర్ నటి టబు, ఐశ్వర్య రాజేష్, సుష్మిత భట్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం 2026 డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఇదే డిసంబర్ నెలలో నాగ్ తనయుడు అక్కినేని నాగ చైతన్య హీరోగా రూపొందుతోన్న పాన్ ఇండియా సినిమా వృషకర్మ కూడా రిలీజ్ కాబోతోంది. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. కార్తీక్ వర్మ దండు ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. ఈ ఏడాది అఖిల్ అక్కినేని లెనిన్ సినిమాతో వచ్చి హిట్ కొట్టాడు. అలాగే, డిసెంబర్‌లో నాగ చైతన్య-నాగార్జున కూడా తమ సినిమాలతో హిట్ కొడితే ఓ రికార్డ్‌గా మిగులుతుంది. చూడాలి, మరి ఏం జరుగుతుందో.

#Nagarjuna#Ashok Selvan#King 100#Ra.Karthik#Tollywood
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి