క్రైమ్

CyberCrime : ఏపీకే ఫైల్, ఓటీపీలు రాలేదు.. క్రెడిట్ కార్డులో రూ.2 లక్షలకు పైగా ఖాళీ.. ఎలా?

రచన: Kumar•••4 నిమిషాల పఠనం

టెక్నాలజీ వినియోగం పెరగడంతో పనులు సులభంగా, త్వరగా, ఖచ్చితత్వంతో అవుతున్నాయని సంతోషపడలా? లేక కష్టపడి సంపాదించుకుని, దాచుకున్న సొమ్ము దొంగల పాలవుతోందని బాధపడలా? అంటూ కొందరు సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

టెక్నాలజీ వినియోగం పెరగడంతో పనులు సులభంగా, త్వరగా, ఖచ్చితత్వంతో అవుతున్నాయని సంతోషపడలా? లేక కష్టపడి సంపాదించుకుని, దాచుకున్న సొమ్ము దొంగల పాలవుతోందని బాధపడలా? అంటూ కొందరు సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టెక్నాలజీ వినియోగం పెరగడం ఏమో కానీ ఎవరూ రాకుండానే ఇంట్లో దొంగలు పడుతున్నారు.బ్యాంకు ఖాతాలోని సొమ్ము క్షణాల్లో మాయం అవుతోంది. గతంలో దొంగలు రాత్రిళ్లు తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసి దోచేవారు.

కానీ, ఇప్పుడు దొంగలు అప్డేట్ అయ్యారు.పోలీసులకు దొరకకుండా ఎలా దొంగతనాలు చేయాలో యూట్యూబ్ చూసి మరి నేర్చుకుని చోరీలకు పాల్పడుతున్నారు. ఇక చదువుకున్న కొందరు క్రిమినల్స్ అవతారం ఎత్తారు. కష్టపడకుండా ఇతరుల కష్టాన్ని సైబర్ మోసాల రూపంలో దోచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ వ్యక్తి తన వద్దనున్న క్రెడిట్ కార్డుల తనకు తెలియకుండానే రూ.2.59 లక్షలు ఖాళీ అయినట్టు గుర్తించాడు. ఆ వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.

వివరాల్లోకివెళితే.. ఉప్పల్ బేరప్పగడ్డకు చెందిన జి. పిచ్చయ్య రావు (42)కు ఆర్బీఎల్, బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డులు ఉన్నాయి. సెప్టెంబర్ 5న ఈ రెండు క్రెడిట్ కార్డుల నుంచి తనకు తెలియకుండా మూడు అనధికారిక లావాదేవీలు జరిగి మొత్తం రూ.2,59,240 డెబిట్ అయినట్లు గుర్తించాడు. పోలీసులకు అసలు వివరాలు వెల్లడించారు.

తన బ్యాంకింగ్ వివరాలు, OTP, PIN, CVV వివరాలను ఎవరికీ వెల్లడించలేదని, అనుమానాస్పద ఫోన్ కాల్, SMS, వాట్సాప్ సందేశం, APK ఫైల్ కూడా తనకు రాలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు.లావాదేవీలను గుర్తించిన అనంతరం బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను పరిశీలించగా తన అనుమతి లేకుండానే నగదు డెబిట్ అయినట్లు ఆధారాలు సేకరించి పోలీసులకు అందజేశాడు.ఆర్ బీఎల్ క్రెడిట్ కార్డు నుంచి రూ.2,36,740, బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డు నుంచి రూ.37,189 డెబిట్ అయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాధితుడి నుంచి వివరాలు సేకరించిన మల్కాజిగిరి సైబర్ క్రైమ్ పోలీసులు కేసు ఫైల్ చేసి విచారణ ప్రారంభించనట్టు సీఐ నాగాచారి తెలిపారు.

#cybercrime#hyderabad#creditcards#amount missing#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి