సినిమా

Tollywood: నాని–సుజీత్ ‘బ్లడీ రోమియో’లో హీరోయిన్ ఎవరు?

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Tollywood: నేచురల్ స్టార్ నాని, ‘ఓజీ’ ఫేమ్ సుజీత్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘బ్లడీ రోమియో’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. నాని బర్త్‌డే సందర్భంగా టైటిల్, యానిమేటెడ్ ప్రమోషనల్ వీడియోతో ఈ సినిమాపై ఆసక్తిని మరింత పెంచారు మేకర్స్. యాక్షన్, డార్క్ హ్యూమర్, గ్యాంగ్‌స్టర్ అంశాలతో సుజీత్ తన స్టైల్‌లో ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Tollywood: నేచురల్ స్టార్ నాని, ‘ఓజీ’ ఫేమ్ సుజీత్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘బ్లడీ రోమియో’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. నాని బర్త్‌డే సందర్భంగా టైటిల్, యానిమేటెడ్ ప్రమోషనల్ వీడియోతో ఈ సినిమాపై ఆసక్తిని మరింత పెంచారు మేకర్స్. యాక్షన్, డార్క్ హ్యూమర్, గ్యాంగ్‌స్టర్ అంశాలతో సుజీత్ తన స్టైల్‌లో ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి?

ఈ సినిమాలో నానికి జోడీగా ఎవరు నటిస్తారన్నది చాలారోజుల నుంచి ఆసక్తికరమైన చర్చగా మారింది. తాజాగా, మీనాక్షి చౌదరి పేరు తెరపైకి వచ్చింది. ‘బ్లడీ రోమియో’లో హీరోయిన్ పాత్ర కోసం మీనాక్షి చౌదరిని సంప్రదించినట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆమెతో మేకర్స్ చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే, ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. హీరోయిన్ విషయంలో ఇప్పటివరకు చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాబట్టి, మీనాక్షి చౌదరినే నాని సరసన ఫైనల్ చేశారని ఇప్పుడే చెప్పలేం. అధికారిక ప్రకటన వచ్చే వరకు ఇది ఇండస్ట్రీలో వినిపిస్తున్న గాసిప్ వార్తగానే భావించాలి.

మీనాక్షి మాత్రమే కాదు..వీరు కూడా?

‘బ్లడీ రోమియో’ హీరోయిన్ విషయంలో ఒక్క మీనాక్షి గురించే కాదు ఇంతకముందు కూడా పలువురు హీరోయిన్ల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. పూజా హెగ్డే, తృప్తి డిమ్రి పేర్లు గతంలో వినిపించగా, లెనిన్ హిట్ తర్వాత భాగ్యశ్రీ బోర్సే పేరు కూడా పరిశీలనలో ఉందనే వార్తలు వచ్చాయి. అంతేకాదు, సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ఓజీ మూవీలో ప్రియాంక అరుళ్ మోహన్ పవన్ సరసన నటించింది. ఆ సమయంలో దర్శకుడు సుజీత్‌తో ప్రియాంక కి మంచి బాండింగ్ ఏర్పడింది.

ఆల్రెడీ నానితో గ్యాంగ్ లీడర్, సరిపోదా శనివారం సినిమాలలో హీరోయిన్‌గా నటించింది. అందుకే, దాదాపు సుజీత్-నానిల బ్లడీ రోమియోలో హీరోయిన్‌గా ప్రియాంకకే ఎక్కువ ఛాన్స్ ఉందని మాట్లాడుకున్నారు. గోట్, సంక్రాంతికి వస్తున్నాం, అనగనగా ఒకరాజు, వృష్ణకర్మ లాంటి సినిమాలతో మీనాక్షి కూడా మంచి ట్రెండింగ్‌లో ఉంది. అందుకే, ఇప్పుడు మీనాక్షి చౌదరి పేరు కూడా బలంగా వినిపిస్తుంది. మరి, ఎవరిని మేకర్స్ ఫైనల్ చేస్తారో చూడాలి.

#Nani#Sujith#Meenakshi Chaudary#Bloody Romeo
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి