క్రైమ్

Crime : భర్త వైద్యం కోసం భార్య దారుణం.. ఆమె లేదని భర్త ఘోరం!

రచన: Kumar•••4 నిమిషాల పఠనం

భర్త వైద్యం కోసం ఓ భార్య ఎవరూ చేయని సాహసానికి ఒడిగట్టింది. ఆ పని చేస్తే ఇట్టే దొరికిపోతానని తెలిసినా డబ్బుల కోసం అలా చేయాల్సి వచ్చిందని పట్టుబడిన తర్వాత పోలీసులకు వివరించింది. ఇకపోతే భార్య తనకు దూరం అయ్యిందనే బాధ భరించలేక ఆ భర్త జీవించాలనుకోలేదు.

భర్త వైద్యం కోసం ఓ భార్య ఎవరూ చేయని సాహసానికి ఒడిగట్టింది. ఆ పని చేస్తే ఇట్టే దొరికిపోతానని తెలిసినా డబ్బుల కోసం అలా చేయాల్సి వచ్చిందని పట్టుబడిన తర్వాత పోలీసులకు వివరించింది. ఇకపోతే భార్య తనకు దూరం అయ్యిందనే బాధ భరించలేక ఆ భర్త జీవించాలనుకోలేదు. ఓ వైపు పరువు, మరోవైపు భార్య దూరం అయ్యిందనే బాధతో తనువు చాలించాలని షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. భార్య చేసిన పనిని తలుచుకుంటూ బలవన్మరణానికి పాల్పడ్డాడు.

ఈ ఘటన ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వైరల్ అవుతోంది.భర్త కోసం భార్య త్యాగం చేస్తే ఆమె దూరమైందని ఏకంగా భర్త ప్రాణాలనే తీసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. జిల్లాలోని పుల్కల్ మండలం పెద్దారెడ్డిపేటలో ఈ నెల 24న వృద్ధురాలు పోచమ్మ(75) దారుణ హత్యకు గురైంది. ఈ మర్డర్ కేసులో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు వృద్ధురాలిని హత్య చేసింది నర్సమ్మ(46)గా నిర్దారించారు.

అనంతరం ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా..నర్సమ్మ తాను చేసిన హత్యను అంగీకరించింది. భర్త యాదయ్య అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, వైద్య ఖర్చులకు డబ్బులు లేవని, అందుకోసమే వృద్ధురాలిని హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడించింది. హత్య అనంతరం వృద్ధురాలి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు, కాళ్ల పట్టీలు దొంగిలించినట్టు నేరం అంగీకరించింది.

దీంతో నిందితురాలు నర్సమ్మను జోగిపేట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. తన భార్య అరెస్టు అయ్యిందన్న విషయం తెలుసుకున్న యాదయ్య.. తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.తన బాగోగులు పట్టించుకునే వారు ఎవరూ లేకపోవడం, భార్య అరెస్టు అవ్వడంతో ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుర్తించిన స్థానికులు ఆస్పత్రికి తరలించినా ఫలితం దక్కేలేదు. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించనున్నట్టు తెలిపారు. యాదయ్య మృతి గురించి భార్య నర్సమ్మకు పోలీసులు సమాచారం అందించినట్టు సమాచారం.

#wife arrest#murder case#husband suicide#sangareddy#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి