ఏపీ

AP : రెడ్‌బుక్ కావాలా? రప్పా రప్పా కావాలా?.. విజయసాయి రెడ్డి సూటి ప్రశ్న!

రచన: Kumar•••4 నిమిషాల పఠనం

ఏపీ రాజకీయాలపై రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితులు, అధికార ప్రతిపక్షపార్టీల నడుమ సాగుతున్న రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయాక ఏపీలో కమ్మ, క్రిస్టియన్ వర్గాలకే అధికారం దక్కిందని అన్నారు.

ఏపీ రాజకీయాలపై రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితులు, అధికార ప్రతిపక్షపార్టీల నడుమ సాగుతున్న రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయాక ఏపీలో కమ్మ, క్రిస్టియన్ వర్గాలకే అధికారం దక్కిందని అన్నారు. విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ, తెలుగుదేశం పార్టీలు కాకుండా రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయం అవసరం ఉందని చెప్పారు.

ఇప్పుడున్నవి రెండు కూడా కుటుంబ పార్టీలేనని వ్యాఖ్యానించారు. కేంద్రంలోని మోడీ సర్కార్ విభజన హామీలు నెరవేర్చకపోయినా, వాటిని అమలు చేయకపోయినా ఇప్పుడున్న రెండు పార్టీలు కేంద్రాన్ని అడగవు అని చెప్పారు. కేంద్రంలో మంత్రి పదవుల కోసం టీడీపీ సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు. 2029 ఎన్నికల్లో సిద్ధాంతాలతో సంబంధం లేకుండా రెండు పార్టీలు పొత్తులు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు.

వారికే పదవులే ముఖ్యమన్నారు. సీఎం చంద్రబాబు నాయుడుకు తన కుమారుడిని సీఎం స్థానంలో ఎలా కూర్చోబెట్టాలన్నదే ముఖ్యమని చెప్పారు. జగన్‌కు కూడా తన కుటుంబ సభ్యులను ఎలా రాజకీయాల్లోకి తీసుకురావాలన్నదే లక్ష్యం అని సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్రానికి పదేళ్లలో ఒక్క గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ కూడా రాలేదని చెప్పారు.గత 12 ఏళ్లలో రూ. 12 లక్షల కోట్లు అప్పు చేశారని, నిజంగా అది రాష్ట్ర అభివృద్ధికి ఎంతవరకు ఉపయోగపడిందని తెలిపాలని అడిగారు.

రాష్ట్రం విడిపోయాక టీటీపీ, వైసీపీ పార్టీలు యువత కోసం ఎలాంటి ఉద్యోగాలను తీసుకురాలేదని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ‘రెడ్ బుక్’ పార్టీకి ఓటెయ్యాలా..‘రప్పా రప్పా’ పార్టీకి ఓటెయ్యాలా? అని యువతనే ఆలోచించుకోవాలని సూటిగా ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీకి కులపిచ్చి అని.. వైసీపీ మతపిచ్చి పార్టీ అని చెప్పారు. ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా రాబోతున్న పార్టీ కోసం యువత ముందుకు రావాలన్నారు. తాను స్థాపించబోయే పార్టీ అధికారంలోకి వచ్చినా తాను సీఎంగా ఉండనని స్పష్టంచేశారు. ముఖ్యమంత్రిగా వేరేవాళ్లకే అవకాశం ఇస్తామని తెలిపారు. పార్టీలో అన్ని కులాల ప్రజలకు సమాన అవకాశాలుంటాయని వెల్లడించారు.

#TDP#YSRCP#andrapradesh#vijayasaireddy#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి