క్రైమ్

Crime : గుట్టుగా వివాహం, హోటల్‌లో కాపురం.. వీడిన ఓయో మర్డర్ మిస్టరీ!

రచన: Kumar•••4 నిమిషాల పఠనం

హైదరాబాద్‌ మహానగరం ఎస్‌ఆర్ నగర్ పరిధిలోని గోకుల్ ప్రైడ్‌‌ హోటల్ (ఓయో)గదిలో ఓ యువతి అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే.హోటల్‌ స్టాఫ్ ఇచ్చిన సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించి ఈ మేరకు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి.

హైదరాబాద్‌ మహానగరం ఎస్‌ఆర్ నగర్ పరిధిలోని గోకుల్ ప్రైడ్‌‌ హోటల్ (ఓయో)గదిలో ఓ యువతి అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే.హోటల్‌ స్టాఫ్ ఇచ్చిన సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించి ఈ మేరకు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి.

వివరాల్లోకివెళితే.. వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం నాగసమందర్ గ్రామంలో నివాసముండే శిరీష(34)కు 2013లో వివాహం జరిగింది. మనస్పర్థల కారణంగా 2016లో భర్తకు విడాకులు ఇచ్చి, తల్లిదండ్రుల వద్ద ఉంటూ ఎస్‌బీఐ కస్టమర్ సర్వీస్ పాయింట్ నిర్వహిస్తోంది.ఈ క్రమంలోనే శిరీషకు శ్రీనివాస్(38) అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. కొంతకాలానికి ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. వీరి పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో గుడిలో శిరీషను పెళ్లి చేసుకున్నాడు శ్రీనివాస్..

అతనిది పెద్దేముల్ మండలం ఓగ్లాపూర్ గ్రామం. పెద్దలు వీరి పెళ్లిని అంగీకరించకపోవడంతో హైదరాబాద్‌కు వచ్చి లాడ్జిలో గడిపి తిరిగి వెళ్లేవారని సమాచారం. అయితే, ఈ నెల 24వ తేదీన దుర్గ, గణేష్ అనే మారుపేర్లతో ఎస్‌ఆర్ నగర్ పరిధిలోని గోకుల్ ప్రైడ్ ఓయోకు వీరిద్దరూ వచ్చారు.

మరుసటి రోజు ఉదయం శ్రీనివాస్ (గణేశ్) వెళ్లిపోతూ.. ఆమె అల్పాహారం చేశాక చెక్‌అవుట్ చేస్తుందని హోటల్ సిబ్బందికి చెప్పాడు.ఎంతకూ ఆమె బయటికి రాకపోవడంతో వేరే తాళంచెవితో గది తెరిచి చూడగా విగతజీవిగా ఉన్న శిరీషను గుర్తించి పోలీసులకు హోటల్ సిబ్బంది సమాచారం ఇచ్చారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. టీవీ సౌండ్ ఎక్కువగా పెట్టి కర్టెన్ రాడ్‌తో శిరీష తలపై బలంగా కొట్టి హతమార్చినట్టు నిర్దారించారు. ప్రస్తుతం శ్రీనివాస్ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. శ్రీనివాస్ గతంలోనూ శిరీషను కొట్టి చికిత్స చేయించాడని, యువతులను వేధించినట్టు అతనిపై పలు కేసులు కూడా ఉన్నాయని పోలీసుల విచారణలో తేలింది.

#oyo hotel#murder#hyderabad#crime#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి