తెలంగాణ

TRS : రెండు ఎమ్మెల్సీలు ‘రెడ్ల’కే..ఇది సామాజిక అన్యాయం కాదా? : కవిత

రచన: Kumar•••5 నిమిషాల పఠనం

సామాజిక న్యాయం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం అవుతుందని పదే పదే లీడర్లు చెబుతుంటారు. కానీ, తీరా సమయం వచ్చే సరికి ఆ విషయం వారికి గుర్తుకురాదేమో అన్నట్టు బిహేవ్ చేస్తుంటారు. రాష్ట్రంలో బీసీ కులాలు ఎక్కువ. ఎన్నికలు వచ్చినా, పదవుల పంపకంలో మాత్రం వారికి అన్యాయం జరుగుతోందని ఆ వర్గం ప్రజలు తమ వాయిస్ వినిపిస్తున్నారు.

సామాజిక న్యాయం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం అవుతుందని పదే పదే లీడర్లు చెబుతుంటారు. కానీ, తీరా సమయం వచ్చే సరికి ఆ విషయం వారికి గుర్తుకురాదేమో అన్నట్టు బిహేవ్ చేస్తుంటారు. రాష్ట్రంలో బీసీ కులాలు ఎక్కువ. ఎన్నికలు వచ్చినా, పదవుల పంపకంలో మాత్రం వారికి అన్యాయం జరుగుతోందని ఆ వర్గం ప్రజలు తమ వాయిస్ వినిపిస్తున్నారు. రాష్ట్ర కేబినెట్లోనూ బీసీలకు న్యాయం జరగలేదని ఇటీవల టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సైతం ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. కనీసం ఆరు మంత్రి పదవులు బీసీకి దక్కాలని హైకమాండ్ వద్ద చెప్పినట్టు గుర్తుచేశారు.

అయితే, తాజాగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సామాజిక వర్గాల వారీగా న్యాయం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కానీ, నిన్న ప్రకటించిన ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో ఇద్దరూ రెడ్డి వర్గానికి చెందిన నేతలే ఉండటం గమనార్హం. మహబూబ్ నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా సామ రామ్మోహన్ రెడ్డి, నల్గొండ - ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి పేర్లను అధికారికంగా ప్రకటించారు.

రెండు స్థానాలకు గాను ఇద్దరు ‘రెడ్డి’ వర్గం నేతలను అభ్యర్థులుగా ప్రకటించడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ విషయంపై స్పందించారు. రెడ్లకే రెండు సీట్లు కేటాయించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.అధికార కాంగ్రెస్ టికెట్ల కేటాయింపులో ఒకే సామాజిక వర్గానికి పెద్దపీట వేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.

‘రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు.. రెండు చోట్లా ‘రెడ్డి’ నాయకులకే టికెట్.. ఇది ముమ్మాటికీ సామాజిక అన్యాయం కాదా?’ అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో సబ్బండ వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాల్సిన బాధ్యత అధికార పార్టీపై ఉందని గుర్తుచేశారు. అలా కాకుండా ఒకే వర్గానికి పెద్దపీట వేయడం తెలంగాణ ఆత్మగౌరవానికే విరుద్ధమని ఘాటు విమర్శలు చేశారు. కవిత చేసిన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో ‘గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ’ టికెట్ల అంశంపై సరికొత్త సామాజిక, రాజకీయ చర్చ మొదలైంది. ముందుగా ఒక రెడ్డి, ఒక బీసీకి ఎమ్మెల్సీ సీట్లు ఇస్తారని భావించినా.. కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఇద్దరు రెడ్లకే ప్రాధాన్యత ఇవ్వడంపై అధికారపార్టీలోనూ జోరుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

#MLC posts#reddy category#congress#Trs#kavitha#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి