తెలంగాణ

HYD : చెత్తే కదా అని తేలికగా తీసిపడేయద్దు.. కాసులు కురిపిస్తుంది!

రచన: Kumar•••4 నిమిషాల పఠనం

రాష్ట్రంలో వినాయక చవితి వేడుకలు ముగిశాయి. నవరాత్రులు పూర్తయ్యాక గణనాథులు గంగమ్మ ఒడికి చేరుకున్నారు. అయితే, చెరువులు, కెనాల్స్, హుస్సేన్ సాగర్‌లో భారీ గణనాథుల వ్యర్థ్యాలు (ఐరన్ మెటీరియల్)పెద్దఎత్తున బయటకు తీశారు.

రాష్ట్రంలో వినాయక చవితి వేడుకలు ముగిశాయి. నవరాత్రులు పూర్తయ్యాక గణనాథులు గంగమ్మ ఒడికి చేరుకున్నారు. అయితే, చెరువులు, కెనాల్స్, హుస్సేన్ సాగర్‌లో భారీ గణనాథుల వ్యర్థ్యాలు (ఐరన్ మెటీరియల్)పెద్దఎత్తున బయటకు తీశారు. వాటిని అలాగే అక్కడే వదిలేశారు.రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పట్టణాల శుద్ధి, జలాల శుద్ధికి రూ. కోట్లు వెచ్చిస్తోంది. కానీ, వ్యర్థాల రూపంలో ఉన్న ఐరన్ మెటీరియల్స్‌ను రీ సైక్లింగ్, రీ యూజ్ విషయంలో పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.

దీంతో ఈ ఐరన్ వ్యర్థాలు పక్కదారి పడుతున్నాయి. వీటి విలువ సైతం రూ. కోట్లు పలుకుతోందని సమాచారం. కాగా, విగ్రహాల వ్యర్థాల తొలగింపు బాధ్యత మాది కాదంటూ జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులు చెబుతున్నారు. ఫలితంగా ఏడేళ్లుగా రూ.కోట్ల విలువైన స్క్రాప్ ప్రైవేటు వ్యక్తుల పరం అవుతోంది. హుస్సేన్ సాగర్‌లో ఏటా లక్షకుపైగా విగ్రహాల నిమజ్జనం జరుగుతోంది. పెద్ద విగ్రహాలకు అమర్చే ఇనుప పైపులు, ఐరన్ రాడ్లు నిమజ్జనం తర్వాత సాగర్ తీరంలో కుప్పలుగా పేరుకుపోతున్నాయి.

ఇవి సుమారు 50 టన్నులకుపైగానే ఉంటాయని అంచనా. వాస్తవానికి ఈ వ్యర్థాలను అధికారికంగా వేలం వేయాల్సి ఉంటుందని పర్యావరణ వేత్తల అభిప్రాయపడుతున్నారు. కానీ, నిమజ్జనం ముగిసిన వెంటనే క్రేన్ ఆపరేటర్లు, బయట కూలీలు ఆ స్క్రాప్‌ను సేకరించి స్థానిక డీలర్లకు అమ్ముకుంటున్నట్టు తెలిసింది. హుస్సేన్ సాగర్‌లోని నీటిని శుద్ధి చేయడానికి రూ.కోట్లు వెచ్చిస్తున్న హెచ్ఎండీఏ.. ఐరన్ వ్యర్థాలను మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలొస్తున్నాయి.

నగర వ్యాప్తంగా మొత్తంగా 139 కేంద్రాల్లో ఈ ఏడాది సుమారు 3 లక్షలకు పైగా విగ్రహాలను నిమజ్జనం చేశారు. హుస్సేన్ సాగర్‌తో పాటు ఐడీఎల్, తుర్కయాంజల్ తదితర చెరువుల్లోనూ 50 టన్నుల ఐరన్, అల్యూమినియమ్ వ్యర్థాలు పేరుకు పోయినట్లు అంచనా. అధికారులు పట్టించుకోకపోవడంతో కోట్లాది రూపాయల ఐరన్ తుక్కు ప్రైవేటు వ్యక్తుల పరం అవుతున్నదని.. చెత్తే కదా అని అంత ఈజీగా తీసిపడేయద్దని.. ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని.. ఈ విషయంలో ఆలోచన చేయాలని పలువురు కోరుతున్నారు.

#ganesh imersion#tankbund#iron scrap#ghmc#hmda#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి