తెలంగాణ

Revanth vs KTR: సీఎం తొలి సిరిసిల్ల పర్యటనపై ఉత్కంఠ.. కేటీఆర్ బహిరంగ లేఖతో రాజ‌కీయ దుమారం!

రచన: Mamatha puppala••5 నిమిషాల పఠనం

తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి రేవంత్ రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనకు వెళ్తుండటంతో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీకి అత్యంత బలమైన కంచుకోటగా భావించే సిరిసిల్ల నియోజకవర్గంలో సీఎం పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటనలో భాగంగా సిరిసిల్ల ప‌ట్ట‌ణంతో పాటు పరిసర ప్రాంతాల్లో సుమారు రూ.345 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి సంక్షేమ పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు.

ఈ పర్యటన కేవలం అభివృద్ధి పనులకే పరిమితం కాకుండా, రాజకీయ ప‌రంగా పాగా వేసేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇటీవల కేటీఆర్‌ను ఉద్దేశించి మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. సిరిసిల్ల ప్రాంతంలో దాదాపు 8,000 ఎకరాల భూమి కబ్జాకు గురైందని, కేటీఆర్ బినామీలే ఈ భూములను ఆక్రమించారని సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాకుండా సిరిసిల్లకు వచ్చి అక్కడి అక్రమాల గుట్టు రట్టు చేస్తానని సవాల్ విసిరిన నేపథ్యంలో, కాంగ్రెస్ ప్రభుత్వ విప్ శ్రీనివాస్ మాట్లాడుతూ కేటీఆర్ రాజకీయ జీవితానికి కౌంట్‌డౌన్ మొదలైందని వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రి చేసిన భూకబ్జా ఆరోపణలపై మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. తన నియోజకవర్గంలో 8 వేల ఎకరాల భూమి కబ్జాకు గురైందంటున్న సీఎం రేవంత్ రెడ్డి, దానికి సంబంధించిన ఆధారాలను గ్రామాల వారీగా, సర్వే నంబర్ల వారీగా వెంటనే బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తూ బహిరంగ లేఖ రాశారు. ఈ వ్యవహారంపై తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని, ఎలాంటి ఆధారాలు లేకుండా అసత్య ప్రచారాలు చేస్తే సహించేది లేదని లేఖలో స్పష్టం చేయడంతో రాజకీయం మరింత వేడెక్కింది.

మరోవైపు బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలను తిప్పికొడుతూ.. కౌంట్‌డౌన్ మొదలైంది కేటీఆర్‌కు కాదని, పాలిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికేనని ఎద్దేవా చేశారు. సిరిసిల్ల నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ చేసిందేమీ లేదని, నేతన్నల సంక్షేమాన్ని విస్మరించిందని ఆరోపించారు. సీఎం పర్యటన నేపథ్యంలో వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన అభివృద్ధి, మిడ్ మానేరు నిర్వాసితుల సమస్యల పరిష్కారం, చేనేత రంగానికి ఊతం, మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం స్పష్టమైన హామీలు ఇవ్వనుండటంతో సిరిసిల్ల వేదికగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ల మధ్య వాగ్వాదం పరాకాష్టకు చేరింది.

#RevanthReddySircillaVisit#KTRLetterToCM#TelanganaPolitics#SircillaDevelopment#BRSVsCongress#RevanthVsKTR#TelanganaNews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి