తెలంగాణ

Telangana By-elections: తెలంగాణ సెమీ ఫైనల్స్.. బరి గీసిన రేవంత్ రెడ్డి!..

రచన: Venu•••8 నిమిషాల పఠనం

ఎల్ నినోతో వేడి ముందే పుట్టుకొచ్చినట్లు, తెలంగాణలో కావాలనే ఉప ఎన్నికలు రాబోతున్నాయి. యథావిధిగా జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్గి పుట్టించింది. ఒక సీట్ బీసీలకు, మరొక స్థానం ఓసీలకు అంటూ ప్రచారం జరిగినా, చివరికి నమ్మిన కాంగ్రెస్ కార్యకర్తలకే సీట్లు ఇచ్చింది.

- ఖైరతాబాద్ , హుజురాబాద్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఒకేసారి?

- ఆ తర్వాత 6 ఉమ్మడి జిల్లాల్లోని గ్రాడ్యుయేట్ ఎన్నికలు

- రెండు సీట్లనూ రెడ్డీలకే ఇచ్చిన ఏఐసీసీ

- పరిస్థితులను అనుకూలంగా మార్చుకునేందుకు ప్లాన్?

- ప్రతిపక్షాలకు అభ్యర్ధుల ఎంపికే సవాలుగా మారిన వైనం

- ఖైరతాబాద్‌లో బీఆర్ఎస్ తర్జన భర్జన

- హుజురాబాద్‌లో పగ తీర్చుకునేందుకు ఈటల రెడీ

- నేడు ఎథిక్ కమిటీ బేటీ.. హుజురాబాద్ ఖాళీపై స్పష్టతకు ఛాన్స్

- బీసీ వాదం బలపడుతున్న సమయంలో ఎమ్మెల్సీ టకెట్లు రెడ్లకే ఇవ్వడం వెనుక రేవంత్ వ్యూహమేంటి?

- బరిగీసి కొట్లాట అంటే ఏంటో చూపించేందుకే ఈ తెగింపా?

- బీసీలకు రాజకీయ వాటాలు అంటూ డిక్లరేషన్స్ ఇచ్చిన అధిష్టానం గెలిచేందుకు రెడ్లపైనే భారం వేసిందా?

- కాంగ్రెస్‌కు పరీక్ష, రేవంత్ మార్క్ ఎన్నికల అభ్యర్ధులపై స్వేచ్ఛ న్యూస్ ప్రత్యేక కథనం

దేవేందర రెడ్డి చింతకుంట్ల

9848070809

స్వేచ్ఛ ఛైర్మన్

ఎల్ నినోతో వేడి ముందే పుట్టుకొచ్చినట్లు, తెలంగాణలో కావాలనే ఉప ఎన్నికలు రాబోతున్నాయి. యథావిధిగా జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్గి పుట్టించింది. ఒక సీట్ బీసీలకు, మరొక స్థానం ఓసీలకు అంటూ ప్రచారం జరిగినా, చివరికి నమ్మిన కాంగ్రెస్ కార్యకర్తలకే సీట్లు ఇచ్చింది. ఒకే పార్టీలో ఉండి కట్టుబడి పని చేసిన వారికి సీట్లు ఇస్తామనే సంకేతాలు ఇచ్చింది.

అయితే బీసీ డిక్లరేషన్ పెట్టి అన్నింట్లో బీసీలకు వాటాలు పెంచుతామని చెప్పిన అధిష్టానం, ఇక్కడ రాజకీయంగా పోటీలో బీసీకి టికెట్ ఇవ్వడంలో వెనుకడుగు వేసిందనే విమర్శలు తావిస్తున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డికి నల్గొండ, వరంగల్, ఖమ్మం స్థానంలో టికెట్ ఖరారైనట్లే.. ఇక హైదరాబాద్, రంగారెడ్డి, మహాబూబ్ నగర్‌లో బీసీకి టికెట్ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నా, సరైనా అభ్యర్థి దొరకడం లేదు.

క్లియర్ మైలేజ్ ఉన్న బీసీ యువనాయకులు బీఆర్ఎస్‌కు కరువయ్యారు. సొంత చర్మిష్మా ఉన్న నాయకుడు కనిపించడం లేదు. డబ్బులు పెట్టి గెలిచే సత్తా ఉందా అనే చూస్తున్నారు. డబ్బులు పెట్టినా, అధికార పార్టీ ఎత్తుగడలను తట్టుకోగలరా, ఎవరెవరు ఏ స్కాంలో ఇరుక్కున్నారో డేటా రెడీ చేసి పెట్టుకున్నారు. వాళ్లు నిలబడితే వాళ్లను సోషల్ మీడియాలో బ్లేమ్ చేసేందుకు రెడీగా ఉన్నారు.

దీంతో పాటు బీఆర్ఎస్‌ కు కచ్చితంగా గెలుపు కావాల్సిందే. ఎమ్మెల్సీలో ఒక్కటైనా గెలవాలి. హైదరాబాద్‌లో రెడ్డి నేతలైతే బొలెడు మంది ఉన్నారు. కానీ, బీసీ అందులోనూ మెజార్జీ పబ్లిక్ ఉన్న సామాజిక వర్గం కోసం వెతుకుతున్నారు. ఒకవేళ తేడా వస్తే, ఎలా ఎన్నికలకు పోవాలో కూడా ప్రత్యమ్నాయ ఆలోచనలు ఉన్నాయి. కమ్యూనిస్టులతో, ఇతర ప్రజా సంఘాలతో కలిసి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

ఈ క్రమంలో స్టేటస్ ఉన్న పెద్దమనిషి కోసం బీఆర్ఎస్ వెతుకుతోంది. అందులో కుల ఇక్వేషన్స్ కూడా చూస్తోంది. మరోవైపు బీజేపీలో బీసీ లీడర్స్ ఉన్నా, పోటీలో నేరుగా అధ్యక్షుడే దిగితే ఎలా ఉంటుందనే కోణంలో కూడా అభిప్రాయాలు తీసుకుంటున్నారు. నేషనల్ పార్టీలో ఇప్పుడే టికెట్ ప్రకటించకుండా ఎన్ రోల్ మెంట్స్‌పై దృష్టి పెట్టాలని కేడర్‌కు ఆదేశాలు ఇచ్చారు.

ఖైరతాబాద్‌లో టికెట్ లొల్లి స్టార్ట్?

ఈసీ నిర్ణయంతో దానం నాగేందర్ ఖైరతాబాద్ బరిలో కాంగ్రెస్ తరుపు నుంచే ఉండనున్నారు. అందుకు ఫైనాన్స్‌తో పాటు అన్ని సమీకరణలు కుదుర్చుకుంటున్నారు. పోటీకి అనర్హత వేటు ఉండదనే ధీమా ఉంది. దీనికి తోడుగా అంతకన్నా బలమైన లీడర్ ఖైరతాబాద్‌లో లేరని కాంగ్రెస్ భావిస్తోంది. దానం కాదంటే విజయా రెడ్డి కాంగ్రెస్ నుంచి రెడీగా ఉన్నారు. బీఆర్ఎస్ వాళ్లు పీజేఆర్ కుమారుడు విష్ణుకు టికెట్ ఇచ్చేలా ఆలోచిస్తున్నారు.

ఇన్నాళ్లు జూబ్లీహిల్స్‌లోనే పని చేసినందున, ఆయన ఖైరతబాద్‌కు పనికి రారని సర్వేలు చెబుతున్నాయి. మన్నే గోవర్ధన్ ఉన్నా, దానం స్పీడ్‌ను తట్టుకోవడం కష్టమని భావిస్తున్నారు. బీజేపీకి రామచంద్రారెడ్డి పేరు వినిపిస్తున్నా బీసీ నేతలు పోటీ పడుతున్నారు. ముందే పేర్లు ప్రకటించే సాహసం ఎవరూ చేయలేకపోతున్నారు.

హుజురాబాద్‌లో మళ్లీ బై ఎలక్షన్స్?

బుధవారం ఎథిక్స్ కమిటీ సమావేశం ఉంది. ఇప్పటికే అసెంబ్లీలో నిర్ణయానికి తీర్మానం చేశారు. దళిత నేతలను కించపర్చిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని, ఆనాడు బీఆర్ఎస్ చేసిన చట్టసవరణలే ఇప్పుడు కౌశిక్ రెడ్డికి ఉచ్చు బిగిసేలా చేస్తున్నారు. ఖైరతాబాద్‌తో పాటు హుజురాబాద్ ఉప ఎన్నికకు వెళ్లేందుకు ప్రిపేర్ అవుతున్నట్టు సమాచారం. ఇక్కడ ఈటల బలమైన నేత ఉండటంతో అధికార పార్టీ కాంగ్రెస్ ఎలాంటి పావులు కదుపుతుంది? ఈటల కుటుంబం నుంచి పోటీకి దిగుతారా? బీఆర్ఎస్‌పై పగ తీర్చుకుంటారా? లేదా ఇప్పటికే కుట్రల్లో ఉన్న బీజేపీ నేతల మధ్య సఖ్యత కుదరక మరో బీసీ నేతను ముందుకు తీసుకొస్తారా అనే అంశం చర్చకు వస్తోంది. ఇక అనర్హత వేటు పడితే కౌశిక్ రెడ్డి కాకుండా మరెవరికి టికెట్ ఇవ్వాలో ఇప్పటికే బీఆర్ఎస్ ఆలోచిస్తోంది.

వేడికి వేడి రగిలించిన రేవంత్?

ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన రెండు నియోజకవర్గాల టికెట్లను రెడ్డిలకే ఇప్పించుకున్న అధికార పార్టీ, అపోజిషన్స్‌పై విరుచుకుపడేందుకు సిద్ధమైంది. రెండు గెలిచి తీరాలని చూస్తోంది. అందుకు సోషల్ మీడియాను విపరితంగా వాడుకునేందుకు సిద్ధమైంది. ఓట్ల నమోదు పక్రియను ఎమ్మెల్యేలకు అప్పగించనుంది. బరిగీసి కోట్లాడితేనే గెలుస్తామని సన్నిహితులతో సీఎం చెప్పినట్లు సమాచారం.

#Telangana#By-elections#Revanth Reddy#BRS#BJP#Congress#Khairatabad#Huzurabad
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి