సినిమా

Chandoo Mondeti: భన్సాలీ నిర్మాణంలో చందు మొండేటి దర్శకుడిగా హిందీ సినిమా!

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Chandoo Mondeti: తెలుగు సినిమా నుంచి పాన్ ఇండియా స్థాయిలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు చందు మొండేటి. ఈ టాలెంట్ డైరెక్టర్ ఇప్పుడు బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. నాగ చైతన్యతో ‘తండేల్’ నిఖిల్‌తో ‘కార్తికేయ 2’, వంటి సినిమాలతో తన కథ-రచనా శైలిని ప్రేక్షకులకు పరిచయం చేసిన చందు.. త్వరలోనే హిందీలో ఓ భారీ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించే అవకాశాలు ఉన్నాయనే వార్తలు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.

ఇప్పటికే, చందు మొండేటి బాలీవుడ్ ఎంట్రీపై పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా, బాలీవుడ్ స్టార్ హీరోలతో ఆయన ఓ భారీ హిస్టారికల్ థ్రిల్లర్ చేయనున్నారనే స్పెక్యులేషన్స్ గతంలో వచ్చాయి. అక్షయ్ కుమార్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో చందు మొండేటి ఓ సినిమా చేయనున్నారనే వార్తలు కూడా ప్రచారంలోకి వచ్చాయి. ఈ ప్రాజెక్ట్‌కు కరణ్ జోహార్ నిర్మాణ బాధ్యతలు చేపట్టనున్నట్లు అప్పట్లో బాలీవుడ్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొట్టాయి.

ఆ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి అప్‌డేట్ మళ్ళీ వినిపించలేదు. కాని, ఇప్పుడు చందు మొండేటి పేరు మరోసారి బాలీవుడ్‌లో వినిపిస్తోంది. ప్రముఖ దర్శక-నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ నిర్మాణంలో చందు దర్శకత్వంలో ఓ హిందీ సినిమా తెరకెక్కే అవకాశాలు ఉన్నాయనే టాక్ మొదలైంది. ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ, వార్త మాత్రం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూ ఆసక్తిని రేపుతోంది.

భన్సాలీ సినిమాలంటేనే భారీ విజువల్స్, బలమైన కథ, చారిత్రక నేపథ్యం, అద్భుతమైన ప్రొడక్షన్ వ్యాల్యూస్ గుర్తుకొస్తాయి. మరోవైపు చందు మొండేటికి కూడా చరిత్ర, పురాణాలు, ఆధ్యాత్మిక అంశాలను కమర్షియల్ కథనంతో ముడిపెట్టడంలో మంచి అనుభవం ఉంది. ‘కార్తికేయ 2’లో ఈ అంశాలను ఆయన అద్భుతంగా చూపించారు. ఆ సినిమా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడంతో చందుకు పాన్ ఇండియా దర్శకుడిగా క్రేజ్ పెరిగింది. జాతీయ చలనచిత్ర అవార్డుల రికార్డుల్లోనూ ‘కార్తికేయ 2’ ఉత్తమ తెలుగు చిత్రంగా నమోదైంది. దీంతో, బాలీవుడ్‌లో ఈ క్రేజీ ఆఫర్ వచ్చినట్టుగా సమాచారం. మరి, దీనికి సంబందించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ ఎప్పుడు వస్తుందో చూడాలి.

#Chandoo Mondeti#Sanjay Leela Bhansali#Bollywood#Rana Daggubati
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి