తెలంగాణ

VRK Diet: చిక్కుల్లో వీఆర్‌కే డైట్ సృష్టికర్త వీరమాచినేని.. క్రిమినల్ కేసు నమోదు

రచన: NK••4 నిమిషాల పఠనం

VRK Diet: ప్రముఖ డైట్ స్పెషలిస్ట్, వీఆర్‌కే డైట్ (VRK Diet) సృష్టికర్త వీరమాచినేని రామకృష్ణ చిక్కుల్లో పడ్డారు. ఆయనపై క్రిమినల్ కేసు నమోదైంది. వీరమాచినేని ఇచ్చిన తప్పుడు వైద్య సలహా కారణంగా తన ప్రాణాలకు ముప్పు కలిగిందని ఓ లా విద్యార్థి ఇచ్చిన ఫిర్యాదుతో రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు.

VRK Diet: ప్రముఖ డైట్ స్పెషలిస్ట్, వీఆర్‌కే డైట్ (VRK Diet) సృష్టికర్త వీరమాచినేని రామకృష్ణ చిక్కుల్లో పడ్డారు. ఆయనపై క్రిమినల్ కేసు నమోదైంది. వీరమాచినేని ఇచ్చిన తప్పుడు వైద్య సలహా కారణంగా తన ప్రాణాలకు ముప్పు కలిగిందని ఓ లా విద్యార్థి ఇచ్చిన ఫిర్యాదుతో రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇన్సులిన్ వాడకం నిలిపివేత

బాధితుడి పేరు సాయిక్రిష్ణ. వయసు 30 ఏళ్లు. నిర్మల్ జిల్లాకు చెందిన సాయిక్రిష్ణ టైప్-1 డయాబెటిస్‌తో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో వీఆర్ కే డైట్‌కు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో చూశాడు. వీఆర్‌కే డైట్‌తో టైప్ 1 డయాబెటిస్ నయమవుతుందని ఆ వీడియోల్లో ఉంది. ఆ ప్రచారం చూసిన సాయిక్రిష్ణ.. తన వ్యాధి నయమవుతుందని నమ్మి హైదరాబాద్‌ షేక్‌పేటలో ఉన్న వీఆర్ కే హెల్త్ కేర్ సెంటర్‌ను సంప్రదించాడు. అక్కడ వీరమాచనేని, ఆయన సహాయకుడు కోటేశ్వరరావు ఇచ్చిన సూచనలు, సలహాలతో తాను రెగులర్ గా తీసుకున్న ఇన్సులిన్ వాడకాన్ని ఆపేశాడు.

తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిక

అంతే.. రెండు రోజులకే అతడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబసభ్యులు సాయిక్రిష్ణను సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. సాయిక్రిష్ణను పరీక్షించిన డాక్టర్లు.. డయాబెటిక్ కీటోయాసిడోసిస్‌తో పాటు తీవ్రమైన డీహైడ్రేషన్‌కు గురైనట్లు నిర్ధారించారు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన సాయిక్రిష్ణ.. వీరమాచనేని, కోటేశ్వరరావుపై రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

బాధితుడి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు.. ఫేక్ డాక్టర్, మోసం, ప్రాణాలకు ముప్పు కలిగించడం, నేరపూరిత కుట్ర వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బీఎన్ఎస్ లోని 318(4), 125(ఏ), 61(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

పరిహారం కోరుతూ కోర్టుకు

కాగా, వీఆర్ కే సెంటర్ లో చికిత్స కోసం రూ.26వేలు ఫీజుగా వసూలు చేశారని బాధితుడు తెలిపాడు. ఇక ఆసుపత్రిలో చికిత్స కోసం ఇప్పటికే దాదాపుగా 60వేలు ఖర్చు అయినట్లు వాపోయాడు. దీంతో పరిహారం కోరుతూ నాంపల్లి వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు బాధితుడు.

#Criminal Case#VRK Diet#Veeramachaneni Ramakrishna#Law Student#Rayadurgam Police#Insuline#Type 1 Diabetes#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి