International

Fly dubai: దుబాయ్ విమానం హైజాక్ అయిందా? 17వేల అడుగులు కింద‌కు ఎందుకు వ‌చ్చింది? అస‌లు కార‌ణం ఇదే!!

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు బయలుదేరిన 'ఫ్లై దుబాయ్' (FZ1073) విమానంలో బుధవారం ఆకాశంలో అనూహ్య, ప‌రిణామం చోటుచేసుకుంది. సుమారు 33,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో కాక్‌పిట్‌లో ఉన్న ఇద్దరు పైలట్ల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది.

దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు బయలుదేరిన 'ఫ్లై దుబాయ్' (FZ1073) విమానంలో బుధవారం ఆకాశంలో అనూహ్య, ప‌రిణామం చోటుచేసుకుంది. సుమారు 33,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో కాక్‌పిట్‌లో ఉన్న ఇద్దరు పైలట్ల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ గొడవలో విమానం హఠాత్తుగా కేవలం రెండు నిమిషాల వ్యవధిలోనే ఏకంగా 17,000 అడుగుల కిందకు పడిపోవడంతో పాటు విమానం నుంచి అత్యవసర సంకేతాలు వెలువడటంతో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది.

పరిస్థితి చేయిదాటడంతో విమానం నుంచి మొదట సాధారణ అత్యవసర సంకేతం (Code 7700), ఆ తర్వాతి సెకన్లలోనే హైజాకింగ్ లేదా అక్రమ జోక్యాన్ని సూచించే సంకేతం (Code 7500) పంపబడింది. దీంతో ఇజ్రాయెల్, సౌదీ అరేబియా డిఫెన్స్ బలగాలు తీవ్ర అప్రమత్తమయ్యాయి. తొలుత విమానం హైజాక్‌కు గురైందనే తీవ్ర కలకలం రేగినప్పటికీ, కాక్‌పిట్‌లో ఇద్దరు పైలట్లు కొట్టుకోవడమే దీనికి కారణమని ఇజ్రాయెల్ భద్రతా వర్గాలు, ప్రత్యక్ష సాక్షుల ఆధారంగా స్పష్టమైంది.

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. కాక్‌పిట్ నుంచి అరుపులు వినిపించాయని, ఓ పైలట్ మరో పైలట్‌పై కత్తితో దాడి చేయడంతో రక్త శ్రావ‌మైంద‌ని, ప్రయాణికులు, విమానంలో ప్రయాణిస్తున్న ఇతర పైలట్లు కలిసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారని వార్తలు వెలువడ్డాయి. ఈ అనూహ్య పరిణామాల అనంతరం విమానాన్ని వాయువ్య సౌదీ అరేబియాలోని తబూక్ విమానాశ్రయానికి అత్యవసరంగా మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు.

ఇజ్రాయెల్‌కు వెళ్లే విమానం సౌదీ అరేబియాలో అత్యవసరంగా ల్యాండ్ కావడం దౌత్యపరంగానూ అరుదైన పరిణామంగా మారింది. విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని 'ఫ్లై దుబాయ్' ప్రకటించగా, కాక్‌పిట్‌లో ఘర్షణకు గల అసలు కారణాలపై ఏవియేషన్ అధికారులు లోతైన దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు పూర్తయితేనే వారి మధ్య గొడవకు గల కారణం స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది.

#FlyDubai#AviationAlert#PilotsFight#EmergencyLanding#SaudiArabia#TelAviv#MidAirPanic#FlightSafety
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి