క్రైమ్

హైదరాబాద్‌లో భారీ సైబర్ దోపిడీ.. గంటన్నర వ్యవధిలో రూ.3.34 కోట్లు కొట్టేశారు

రచన: NK•••3 నిమిషాల పఠనం

సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. హైదరాబాద్ లో భారీ సైబర్ దోపిడీకి పాల్పడ్డారు. గంటన్నర వ్యవధిలోనే ఏకంగా రూ.3.34 కోట్లు కాజేశారు సైబర్ కేటుగాళ్లు. రాయదుర్గంలోని NBFC సంస్థకు చెందిన బేగంపేట బ్రాంచ్ అకౌంట్ నుంచి నగదు మళ్లించారు. కేవలం గంటన్నర వ్యవధిలోనే 183..

Cyber Fraud: సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. హైదరాబాద్‌లో భారీ సైబర్ దోపిడీకి పాల్పడ్డారు. గంటన్నర వ్యవధిలోనే ఏకంగా రూ.3.34 కోట్లు కాజేశారు సైబర్ కేటుగాళ్లు. రాయదుర్గంలోని NBFC సంస్థకు చెందిన బేగంపేట బ్రాంచ్ అకౌంట్ నుంచి నగదు మళ్లించారు. కేవలం గంటన్నర వ్యవధిలో 183 విడతలుగా 3.34 కోట్ల రూపాయలను 52 వేర్వేరు మ్యూల్ అకౌంట్లకు ట్రాన్స్‌ఫర్ చేసేశారు. భారీ మొత్తంలో నగదు మాయమైన విషయాన్ని గుర్తించిన కంపెనీ సీఎఫ్ఓ.. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఈ భారీ మోసంపై దర్యాఫ్తు ప్రారంభించింది.

సైబర్ కేటుగాళ్లు తాము కొట్టేసిన డబ్బుని బెంగళూరు, ముంబై, ఢిల్లీ, జబల్ పూర్, రాజస్తాన్, పుణె, గుజరాత్, జమ్ముకశ్మీర్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని మ్యూల్ ఖాతాల్లోకి మళ్లించినట్లు సైబర్ సెక్యూరిటీ బ్యూరో గుర్తించింది. కాగా, నాన్ బ్యాంకింగ్ సెక్టార్‌కి సంబంధించిన సిస్టమ్‌ని సైబర్ క్రిమినల్స్ ఏ విధంగా హ్యాక్ చేశారు? అనేది తెలియాల్సి ఉంది.

డిజిటల్ విప్లవంతో పాటు రోజురోజుకి పెరిగిపోతున్న సైబర్ మోసాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. అధునాతన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిందని ఆనందపడేలోపే.. పెరిగిపోతున్న సైబర్ మోసాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

#Cyber Fraud#Hyderabad#Raidurgam#NBFC#Cyber Cheat#Telangana Cyber Security Bureau#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి