తెలంగాణ

Telangana: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ కలిసే పోటీ- మహేశ్ గౌడ్

రచన: NK•••4 నిమిషాల పఠనం

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై విరుచుకుపడ్డారు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్. ఆ రెండు పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని ఆయన ఆరోపించారు.

Telangana Politics: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై విరుచుకుపడ్డారు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్. ఆ రెండు పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని ఆయన ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ కలిసే పోటీ చేస్తాయని.. రాసి పెట్టుకోండి అంటూ హాట్ కామెంట్స్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై ఎంక్వైరీ కమిషన్ వేసింది, అందులో అవకతవకలను బయటపెట్టింది కాంగ్రెస్ పార్టీనే అని ఆయన స్పష్టం చేశారు.

సీబీఐ ఎందుకు చర్యలు తీసుకోలేదు?

దీనిపై అసెంబ్లీలో సుదీర్ఘంగా చర్చించి సీబీఐకి నివేదిక పంపించామని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం నివేదిక పంపి ఇన్ని రోజులు అవుతున్నా ఇప్పటివరకు సీబీఐ ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదని మహేశ్ గౌడ్ ప్రశ్నించారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను నిలదీసే దమ్ము రాష్ట్ర బీజేపీ నేతలకు లేదన్నారు. అందుకే కాంగ్రెస్ పై నిందలు వేస్తున్నారని ధ్వజమెత్తారు.

మోదీ, షాలను కలిసే దమ్ము లేదు

''అవినీతి గురించి మాట్లాడే తెలంగాణ బీజేపీ ఎంపీలు.. ప్రధాని మోదీ, అమిత్ షాను కలిసి కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన నివేదికపై ఎంక్వైరీ చేయటం లేదని ఎందుకు అడగటం లేదు? మీకు చేతకాక.. మోదీని, అమిత్ షాను కలిసే దమ్ములేక మేము తొక్కి పెట్టామంటున్నారు. కిషన్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదు? మీ దగ్గర తప్పు పెట్టుకుని మా గురించి మాట్లాడితే ఎలా?

నివేదికలు రాగానే కేసీఆర్ పై చర్యలు!

కేసీఆర్ కుటుంబం పదేళ్లుగా చేసిన అవినీతిపై విచారణ జరుగుతోంది. నివేదికలు వచ్చాక చర్యలు ఉంటాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అగ్రిమెంట్లు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. వీలైనంతవరకు తప్పులను సరిదిద్దే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోంది. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని అందరికీ తెలుసు. ఇప్పటివరకు ఆ పార్టీలు ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించలేదు.

అందుకే.. అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు

ఆ రెండు పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉంది. బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత వారిని ఏ విధంగా గెలిపించాలో ఆలోచన చేసి తమ పార్టీ అభ్యర్థులను బీఆర్ఎస్ ప్రకటించే పరిస్థితి ఉంది. ఒప్పందంలో భాగంగానే పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం పెట్టిన ప్రతి బిల్లుకి బీఆర్ఎస్ ఓటు వేసింది'' అని మహేశ్ గౌడ్ ఆరోపించారు.

#Bjp#Brs#Congress#Telangana Politics#Mahesh Kumar Goud#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి