National

whatsapp: ఫోన్‌లో సిమ్ లేకపోతే ఇక వాట్సాప్ బంద్..

రచన: Mahesh•••4 నిమిషాల పఠనం

whatsapp: వాట్సాప్, టెలిగ్రామ్ లాంటి మెసేజింగ్ యాప్‌లను ఉపయోగించే వారికి కేంద్ర ప్రభుత్వం గట్టి ఝలక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. మొబైల్ నుంచి సిమ్ కార్డు తీసేసినా, లేదా కేవలం వైఫై కనెక్షన్‌తో ఫోన్లు, ట్యాబ్‌లలో వాట్సాప్ నడిపించే పద్ధతికి త్వరలోనే కాలం చెల్లనుంది.

whatsapp: వాట్సాప్, టెలిగ్రామ్ లాంటి మెసేజింగ్ యాప్‌లను ఉపయోగించే వారికి కేంద్ర ప్రభుత్వం గట్టి ఝలక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. మొబైల్ నుంచి సిమ్ కార్డు తీసేసినా, లేదా కేవలం వైఫై కనెక్షన్‌తో ఫోన్లు, ట్యాబ్‌లలో వాట్సాప్ నడిపించే పద్ధతికి త్వరలోనే కాలం చెల్లనుంది. 'సిమ్ బైండింగ్' పేరిట సరికొత్త రూల్స్‌ను ప్రభుత్వం ప్రతిపాదించింది. దీని ప్రకారం, మీ వాట్సాప్ అకౌంట్ ఏ నంబర్‌తో రిజిస్టర్ అయి ఉందో.. ఆ సిమ్ కార్డు తప్పనిసరిగా అదే ఫోన్‌లో యాక్టివ్‌గా ఉంటేనే యాప్ పనిచేస్తుంది. ఈ నిబంధనలను పాటించేందుకు మెసేజింగ్ సంస్థలకు 2026 డిసెంబర్ 31 వరకు గడువు ఇచ్చారు. అంటే, 2027 జనవరి 1 నుంచి ఈ రూల్స్ కచ్చితంగా అమల్లోకి రానున్నాయి.

అసలేంటీ సిమ్ బైండింగ్?

ప్రస్తుతం వాట్సాప్‌లో ఒక్కసారి ఓటీపీ వెరిఫికేషన్ పూర్తయితే చాలు.. ఆ తర్వాత సిమ్ తీసేసినా, సిమ్ లేని వేరే డివైజ్‌లో వైఫైతో వాడుకున్నా ఎలాంటి సమస్యా ఉండటం లేదు. సైబర్ నేరగాళ్లకు ఇదే పెద్ద అవకాశంగా మారింది. ఇండియన్ మొబైల్ నంబర్లతో ఓటీపీ ద్వారా వాట్సాప్ యాక్టివేట్ చేసుకుని, ఆపై సిమ్ పారేసి వైఫై ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారు. సిమ్ లేకపోవడంతో ఇలాంటి నేరగాళ్లను పట్టుకోవడం పోలీసులకు తలనొప్పిగా మారింది. ఈ అక్రమాలకు ఫుల్‌స్టాప్ పెట్టడానికే.. అకౌంట్‌తో లింక్ అయిన సిమ్ నిరంతరం ఆ మొబైల్‌లోనే ఉండేలా 'సిమ్ బైండింగ్' రూల్స్‌ను తెరపైకి తెచ్చారు.

ఎవరికి ఇబ్బంది అవుతుంది..

ఫోన్ నుంచి సిమ్ కార్డు బయటకు తీసి, కేవలం వైఫైతో వాట్సాప్ నడిపేవారికి యాప్ పనిచేయదు. సిమ్ స్లాట్ లేని కేవలం వైఫై సపోర్ట్ చేసే ట్యాబ్‌లలో వాట్సాప్ వాడేవారికి ఇబ్బందులు తప్పవు. అలాగే ఒకే నంబర్‌తో వేర్వేరు పరికరాల్లో అకౌంట్ నడిపేవారికి కూడా ఈ రూల్స్ ప్రకారం ఆంక్షలు ఎదురుకావచ్చు. అయితే, తమ మొబైల్‌లోనే సిమ్ కార్డును ఉంచి సాధారణంగా వాట్సాప్ వాడే కోట్లాది మంది యూజర్స్‌కి ఈ రూల్స్‌తో ఎలాంటి సమస్య ఉండదని కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతానికైతే ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మీ అకౌంట్ ఉన్న నంబర్ సిమ్ యాక్టివ్‌గా ఉండేలా చూసుకుంటే సరిపోతుందని చెబుతున్నారు. రానున్న రోజుల్లో దీనికి సంబంధించి కంపెనీల నుంచి పూర్తిస్థాయి విధివిధానాలు రానున్నాయి.

#WhatsApp#WhatsApp New Rules#WhatsApp Sim Binding#SIM Binding Rules#WhatsApp India#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి