ఏపీ

ap local body elections : ఏపీలో మున్సిపల్ ఎన్నికలు రీషెడ్యూల్.. కొత్త పోలింగ్ తేదీ ఇదే!

రచన: Mahesh••3 నిమిషాల పఠనం

ap local body elections : ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌లో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక మార్పులు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా జరగాల్సిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ తేదీని రీషెడ్యూల్ చేస్తూ తాజాగా అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ap local body elections : ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌లో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక మార్పులు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా జరగాల్సిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ తేదీని రీషెడ్యూల్ చేస్తూ తాజాగా అధికారిక ప్రకటన విడుదల చేసింది. పాత షెడ్యూల్ ప్రకారం ఈ నెల 28న జరగాల్సిన మున్సిపల్ పోలింగ్‌ను నవంబర్ 1వ తేదీకి వాయిదా వేసింది. ఇక ఈ ఎన్నికల ఫలితాలను నవంబర్ 3న వెల్లడించనున్నట్లు స్పష్టం చేసింది. బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితా ఈ నెల 25న విడుదల కానుంది.

మైదుకూరు పోలింగ్‌పై వీడని సస్పెన్స్

రాష్ట్రంలోని మిగతా మున్సిపాలిటీలన్నింటికీ నవంబర్ 1న పోలింగ్ ఖరారైనప్పటికీ, వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరుపై మాత్రం ఈసీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నామినేషన్ల పత్రాల ధ్వంసం వివాదం నేపథ్యంలో అక్కడ మళ్లీ కొత్తగా నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాతే పోలింగ్ తేదీని ఖరారు చేస్తామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు యథాతథం

మున్సిపల్ పోలింగ్ తేదీలు మారినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో జరగాల్సిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు లేదు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే నవంబర్ 3వ తేదీన వీటికి పోలింగ్ జరగనుంది. మున్సిపల్ ఎన్నికల తేదీ నవంబర్ 1కి మారడంతో ప్రచారానికి ప్రధాన పార్టీల అభ్యర్థులకు అదనంగా మరికొంత సమయం లభించినట్లయింది.

#Andhra Pradesh Elections#AP Local Body Elections#AP Municipal Elections#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి