National

75% మార్కులు దాటితేనే డ్రైవింగ్‌ లైసెన్స్‌.. కేంద్రం కొత్త రూల్స్ ఇవే!

రచన: Mahesh•••4 నిమిషాల పఠనం

driving licence new rules: డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం గట్టి నిబంధనలను తెరపైకి తెచ్చింది. రోడ్డు భద్రతను పెంచే లక్ష్యంతో డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియలో కీలక మార్పులను ప్రతిపాదిస్తూ కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కొత్త ముసాయిదా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

driving licence new rules: డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం గట్టి నిబంధనలను తెరపైకి తెచ్చింది. రోడ్డు భద్రతను పెంచే లక్ష్యంతో డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియలో కీలక మార్పులను ప్రతిపాదిస్తూ కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కొత్త ముసాయిదా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇకపై ఆన్‌లైన్ టెస్టుల్లో పాస్ అవ్వడం అంత సులువు కాదు.

కనీస పాస్ మార్కులు 75 శాతానికి పెంపు ..

సురక్షిత డ్రైవింగ్‌పై అభ్యర్థులకు ఎంతవరకు అవగాహన ఉందో తెలుసుకునేందుకు నిర్వహించే ఆన్‌లైన్ అసెస్‌మెంట్ పరీక్షలో పాస్ మార్కులను కేంద్రం భారీగా పెంచింది. ఇప్పటివరకు 60 శాతం మార్కులు వస్తే సరిపోయేది, కానీ తాజా రూల్స్‌తో దాన్ని 75 శాతానికి పెంచారు. అంతేకాకుండా ఈ పరీక్ష రాయడానికి ముందు కనీసం 30 నిమిషాల పాటు సేఫ్ డ్రైవింగ్ ట్యుటోరియల్‌ను తప్పనిసరిగా చూడాల్సి ఉంటుంది. ఈ ప్రతిపాదనలపై 30 రోజుల పాటు ప్రజలు, సంబంధిత వర్గాల నుంచి అభ్యంతరాలు, సలహాలు స్వీకరించి తుది ఉత్తర్వులు ఇవ్వనున్నారు.

15 రోజుల్లో తేల్చాల్సిందే.. అడ్రస్ మార్పు ఫ్రీ

లైసెన్స్‌లలో పేరు, చిరునామా మార్పుల కోసం ఆఫీస్‌ల చుట్టూ తిరిగే బాధలను తగ్గించేందుకు అధికారులకు గడువు విధించారు. వివరాల మార్పు అఫ్లికేషన్‌ను అధికారులు 15 రోజుల్లోగా ఆమోదించాలి లేదా తిరస్కరించాలి. ఒకవేళ రిజెక్ట్ చేస్తే ఎందుకు చేశారో కూడా సరైన కారణం చెప్పాల్సి ఉంటుంది. అడ్రస్ మార్పు కోసం పెట్టుకున్న దరఖాస్తుపై 30 రోజుల వరకు అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే, అది ఆటోమేటిక్‌గా ఆమోదం పొందినట్లే పరిగణిస్తారు. ఆధార్ అథెంటికేషన్ ద్వారా ఆన్‌లైన్‌లో చేసుకునే పేరు, చిరునామా మార్పులకు ఎలాంటి ఫీజు లేకుండా ఫ్రీ సేవలు అందించేలా ప్లాన్ చేస్తున్నారు.

అడ్రస్ ప్రూఫ్‌గా ఇకపై ఎల్ఐసీ పనికిరాదు

గుర్తింపు, వయస్సు, చిరునామా ధ్రువీకరణ పత్రాల విషయంలోనూ స్పష్టత ఇచ్చారు. ఆధార్, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ, బర్త్ సర్టిఫికెట్, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు, ఇ-రేషన్ కార్డు, గత 3 నెలల కరెంట్ లేదా గ్యాస్ బిల్లులను అనుమతిస్తారు. అయితే ఇప్పటివరకు చిరునామా కోసం వాడుతున్న ఎల్‌ఐసీ పాలసీలను ధ్రువీకరణ పత్రాల జాబితా నుంచి పూర్తిగా తొలగించారు. అలాగే ఇకపై కొత్తగా ఇచ్చే లైసెన్సులు, రెన్యువల్ కార్డులను కేవలం లామినేటెడ్ లేదా పీవీసీ కార్డుల రూపంలోనే జారీ చేయాలని స్పష్టం చేశారు.

#Driving Licence#Driving Licence New Rules#Driving Licence Rules India#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి