Health

Health: కూల్ డ్రింక్స్ వల్ల ఆరోగ్యానికి జరిగే నష్టం తెలిస్తే షాక్ అవుతారు!!..

రచన: Venu6 నిమిషాల పఠనం

చల్లటి కుల్ డ్రింక్ గొంతులోకి దిగగానే హాయిగా స్వీట్ గా అనిపిస్తుంది. ముఖ్యంగా నేటి జీవన శైలిలో ఈ సాఫ్ట్ డ్రింక్స్ తాగని వారిని వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు.. కొందరైతే రోజుకు ఒకటికన్నా ఎక్కువ తీసుకుంటారు.. కానీ, ఆ డ్రింక్ శరీరంలోకి వెళ్లిన తర్వాత జరిగే పరిణామాలు ఎంత దారుణంగా ఉంటాయో తెలుసా?

చల్లటి కుల్ డ్రింక్ గొంతులోకి దిగగానే హాయిగా స్వీట్ గా అనిపిస్తుంది. ముఖ్యంగా నేటి జీవన శైలిలో ఈ సాఫ్ట్ డ్రింక్స్ తాగని వారిని వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు.. కొందరైతే రోజుకు ఒకటికన్నా ఎక్కువ తీసుకుంటారు.. కానీ, ఆ డ్రింక్ శరీరంలోకి వెళ్లిన తర్వాత జరిగే పరిణామాలు ఎంత దారుణంగా ఉంటాయో వైద్యులు పలు సందర్భాలలో వివరించారు.. ఐనా ఐ డోంట్ కేర్ అంటున్నారా? అయితే మీ కోసమే ఈ వార్త..

సాధారణంగా ఒక మనిషి 350 ఎం.ఎల్ డ్రింక్ తాగిన తొలి 10 నిమిషాల్లోనే దాదాపు 10 చెంచాల చక్కెర ఒక్కసారిగా మీ రక్తంలోకి చేరుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.. అయితే ఇంత చక్కెర ఒకేసారి పొట్టలోకి వెళ్తే ఏదో ఒకటి జరగాలి కదా?.. కానీ, డ్రింక్‌లో ఉండే 'ఫాస్ఫరిక్ యాసిడ్' ఆ తీపి తీవ్రతను తగ్గించి, ఎలాంటి ఎఫెక్ట్ బయటపడకుండా అడ్డుకుంటుందని పేర్కొంటున్నారు..

ఆ తర్వాత 20 నిమిషాల సమయానికి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అనూహ్యంగా పెరుగుతాయి. దీన్ని నియంత్రించడానికి మీ ప్యాంక్రియాస్ ఒక్కసారిగా ఇన్సులిన్‌ను భారీగా విడుదల చేస్తుంది. వైద్య పరిభాషలో దీనిని 'ఇన్సులిన్ స్పైక్' అంటారు. దాంతో కాలేయం వెంటనే రంగంలోకి దిగి, రక్తంలో మిగిలిపోయిన అదనపు చక్కెరను కొవ్వుగా మార్చడం ప్రారంభిస్తుంది. ఇది కాలక్రమేణా 'నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్' సమస్యకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.

ఇక 40 నిమిషాలు పూర్తయ్యేసరికి డ్రింక్‌లోని కేఫిన్ పూర్తిగా శరీరానికి పడుతుంది. కంటి పాపలు విచ్చుకుంటాయి, రక్తపోటు పెరుగుతుంది. కాలేయం మరింత గ్లూకోజ్‌ను రక్తంలోకి విడుదల చేస్తుంది. మెదడులోని ‘డోపమైన్’రసాయనం ఉత్తేజితమై, మీకు తాత్కాలికంగా ఆనందాన్ని, హుషారును కలిగిస్తుంది. నిజానికి హెరాయిన్, కోకైన్ వంటి డ్రగ్స్ మెదడుపై ఎలాంటి ప్రభావం చూపుతాయో, చక్కెర కూడా సరిగ్గా అదే రకమైన వ్యసనాన్ని ప్రేరేపిస్తుందని నరాల వైద్య నిపుణులు చెబుతున్నారు.

మరో 60 నిమిషాల తర్వాత ఫాస్ఫరిక్ యాసిడ్ చిన్నపేగులోని క్యాల్షియం, మెగ్నీషియం, జింక్ వంటి ముఖ్యమైన ఖనిజాలతో బంధం ఏర్పరుస్తుంది. దీనికి తోడు డ్రింక్‌లోని డైయూరెటిక్ గుణాలు ఉన్న కేఫిన్ వలన మీకు మూత్రవిసర్జన అవుతుంది. ఈ ప్రక్రియలో మీ ఎముకలకు చేరాల్సిన క్యాల్షియం మూత్రం ద్వారా బయటకు పోతుంది. ఫలితంగా ఎముకల బలం, సాంద్రత తగ్గి అవి పెళుసుగా మారడం, , పళ్ళు పుచ్చిపోవడం వంటివి జరుగుతాయని వైద్యులు తెలియచేస్తున్నారు.. దీనినే 'ఓస్టియోపోరోసిస్' వ్యాధి అంటారని చెబుతున్నారు..

ఇలా ప్రతిరోజూ క్రమం తప్పకుండా డ్రింక్స్ తాగితే.. నిరంతర ఇన్సులిన్ నిరోధకత వల్ల 'టైప్-2 మధుమేహం', గుండెజబ్బులు, విసెరల్ ఫ్యాట్ అని పిలిచే ప్రమాదకరమైన పొత్తికడుపు కొవ్వు, మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడతాయని హెచ్చరిస్తున్నారు.. అందుకే దాహం వేసినప్పుడు ఇలాంటి డ్రింక్స్ కాకుండా ఇంట్లో తక్కువ చక్కరతో తయారు చేసుకున్న డ్రింక్స్ తాగడం ఉత్తమమని ఆరోగ్యనిపుణులు పేర్కొంటున్నారు..

ముఖ్య గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇది నిపుణుల లేదా వైద్యుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునే ముందు ఖచ్చితంగా మీ డాక్టర్‌ను సంప్రదించాల్సిందిగా మనవి!..

#Health Warnings#Soft#Drink#Phosphoric#acid#Liver#Caffeine#Dopamine#Addiction#Diuretic#Osteoporosis#Insulin Resistance#Type-2 Diabetes
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి