National

Nepal Floods: నేపాల్‌లో జలప్రళయం.. 675కు చేరిన మృతుల సంఖ్య!

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

పొరుగు దేశమైన నేపాల్‌ను భారీ వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి ప్రకృతి విపత్తులు అతలాకుతలం చేస్తున్నాయి. భోటే కోశి నదికి ఆకస్మికంగా వచ్చిన వరదల తాకిడికి మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. నేపాల్ జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ నివేదిక ప్రకారం.. ఇప్పటివరకు 675మంది మృతదేహాలను వెలికితీయగా, మరో 2,498 మంది గల్లంతయ్యారు.

పొరుగు దేశమైన నేపాల్‌ను భారీ వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి ప్రకృతి విపత్తులు అతలాకుతలం చేస్తున్నాయి. భోటే కోశి నదికి ఆకస్మికంగా వచ్చిన వరదల తాకిడికి మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. నేపాల్ జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ నివేదిక ప్రకారం.. ఇప్పటివరకు 675మంది మృతదేహాలను వెలికితీయగా, మరో 2,498 మంది గల్లంతయ్యారు. అంతేకాకుండా 589మంది విదేశీయులతో సహా మొత్తం 753 మంది పర్యాటకుల ఆచూకీ లభించకపోవడంతో పర్యాటక శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ఈ జలప్రళయం వల్ల రసువా, నువాకోట్, ధాదింగ్ జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లి అనేక జలవిద్యుత్ ప్రాజెక్టులు, రహదారులు, వంతెనలు కొట్టుకుపోయాయి. రవాణా, మౌలిక సదుపాయాలు పూర్తిగా ధ్వంసం కావడంతో బాధితులను ఆదుకోవడానికి విరాళాలు, సహాయక సామగ్రి అందించాలని ఖాట్మండు జిల్లా యంత్రాంగం పిలుపునిచ్చింది. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నప్పటికీ, గల్లంతైన వారి సంఖ్య భారీగా ఉండటంతో మృతుల సంఖ్య మరిన్ని పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ఈ కష్టసమయంలో పొరుగు దేశానికి భారత్ కొండంత అండగా నిలుస్తోంది. విపత్తు సహాయక చర్యల్లో భాగంగా విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ వెల్లడించిన వివరాల ప్రకారం, తాజాగా C-130 విమానంలో 11టన్నుల నిత్యావసరాలు, ఫోరెన్సిక్ డీఎన్ఏ కిట్లు, సాంకేతిక బృందాలను నేపాల్‌కు పంపించారు. ఇప్పటివరకు వాయుసేన విమానాల ద్వారా మొత్తం 68.5టన్నుల సహాయక సామగ్రిని ఖాట్మండుకు చేరవేసి, బాధితులకు తక్షణ ఉపశమనం కలిగిస్తున్నారు.

ధ్వంసమైన రహదారుల పునరుద్ధరణ కోసం 230అడుగుల మాడ్యులర్ స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పరికరాలతో కూడిన 16ట్రక్కులు ఇప్పటికే నేపాల్ చేరుకున్నాయి. త్వరలోనే మరో ఏడు బెయిలీ వంతెనల నిర్మాణానికి అవసరమైన సామగ్రితో పాటు భారత సాంకేతిక నిపుణుల బృందాలు అక్కడికి చేరుకోనున్నాయి. క్లిష్ట పరిస్థితుల్లో నేపాల్‌కు అవసరమైన అన్ని రకాల మానవీయ సహాయాన్ని అందించడానికి భారత్ సిద్ధంగా ఉందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

#NepalFloods#IndiaHelpsNepal#DisasterRelief#ExternalAffairsMinistry#SJaishankar#NepalCrisis2026#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి