సినిమా

NBK 111: ఇంట్లోనే డబ్బింగ్ సెటప్ రెడీ చేయించుకున్న బాలయ్య!

రచన: Anshu4 నిమిషాల పఠనం

NBK 111: గాడ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఎన్‌బికే 111 సినిమాకి సంబందించి తాజా అప్‌డేట్ ఒకటి ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య భారీ యాక్షన్ సినిమాను చేస్తున్నాడు. ఇటీవల వచ్చిన గ్లింప్స్‌తో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. అయితే, ఈ సినిమాను డిసెంబర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలయ్య డబ్బింగ్ చెప్పేందుకు ఇంట్లోనే ప్రత్యేకంగా సెటప్ రెడీ చేయించారట.

ఇప్పటి వరకూ బాలయ్య ఏ సినిమా చేసినా, కమర్షియల్ యాడ్ ఫిల్మ్ చేసినా దాదాపుగా డబ్బింగ్ చెప్పేందుకు హైదరాబాద్ ప్రసాద్స్ ల్యాబ్‌ నే ఎంచుకుంటారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే, ప్రస్తుతం, ఆయనకి సర్జరీ అయిన నేపథ్యంలో బయటకి వచ్చే వీలులేక ఇంట్లోనే డబ్బింగ్ చెప్పడానికి ఎక్విప్‌మెంట్‌ను సెట్ చేయించాడట. ఇంట్లోనే ఎన్‌బీకే 111కి సంబందించిన బాలయ్య పాత్ర డబ్బింగ్‌ను త్వరలోనే పూర్తి చేయనున్నట్టుగా తాజా సమాచారం.

ఇక, ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. మంచు మనోజ్ కుమార్ విలన్ పాత్రలో.. సముద్ర ఖని, శరత్‌కుమార్, సంజయ్ దత్, నర్గీస్ ఫక్రీ ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ మూవీలో బాలయ్య రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట్ సతీష్ కిలారు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మ్యూజిక్ సెన్షేషన్ ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నాడు.

కొరటాలతో బాలయ్య ఎన్‌బీకే 112:

గోపీచంద్ మలినేని సినిమా కంప్లీట్ అవగానే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా కొరటాల శివ దర్శకత్వంలో సినిమాను సెట్స్‌పైకి తీసుకురానున్నాడు బాలయ్య. పక్కా మాస్ అండ్ యాక్షన్ కథాంశంతో ఇది తెరకెక్కనుంది. మ్యూజిక్ డైరెక్టర్‌గా అనిరుధ్ రవిచందర్ పేరు పరిశీలనలో ఉంది. ఇక, ఈ సినిమాను 2027, సమ్మర్ కానుకగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

#NBK111#Balakrishna#Gopichand Malineni#Kajal Aggarwal
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి