తెలంగాణ

BJP : రాహుల్ దేశాన్ని విడగొట్టాలని చూస్తున్నారు : బీజేపీ చీఫ్ రాంచందర్ రావు

రచన: Kumar4 నిమిషాల పఠనం

బీజేపీ దళితులను అవమానించిందని లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు ఖండించారు. రామ్ లీలా మైదానం శుద్ధీకరణ గురించి ఆదివారం జాతీయ మీడియాకు ఆయన క్లారిటీ ఇచ్చారు.

బీజేపీ దళితులను అవమానించిందని లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు ఖండించారు. రామ్ లీలా మైదానం శుద్ధీకరణ గురించి ఆదివారం జాతీయ మీడియాకు ఆయన క్లారిటీ ఇచ్చారు. రామ్‌లీలా మైదాన్‌లో జరిగిన పూజా కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ తప్పుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు.ఆయన చౌకబారు రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు.

రామ్ లీలా మైదానంలో జరిగిన క్రతువులో దళితులు కూడా పాల్గొన్నారని స్పష్టంచేశారు.ఏఐసీసీ చీప్ మల్లికార్జున ఖర్గే ప్రసంగం తర్వాత శుద్ధీకరణ చేశామనడంలో వాస్తవం లేదన్నారు.అవన్నీ రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలు మాత్రమే అని వెల్లడించారు.వేరే ఇతర కారణాల వలన అక్కడ పూజ నిర్వహించాల్సి వచ్చిందన్నారు. అసలు విషయం రాహుల్ గాంధీకి తెలిసినప్పటికీ వాస్తవాలను వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బీజేపీ చీఫ్ రామచందర్ రావు మండిపడ్డారు.

రాహుల్ గాంధీ ముందు నుంచి విభజన రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని, ఏ రకంగానైనా దేశాన్ని విడగొట్టాలని చూస్తున్నారని రాంచందర్ రావు ఆరోపించారు. దక్షిణ భారతదేశానికి వచ్చినప్పుడు ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టిస్తారని, ఉత్తరప్రదేశ్‌కు వెళ్లినప్పుడు కులాల ప్రాతిపదికన విభజన రాజకీయాలు చేస్తారని ఆరోపించారు. కేవలం తన రాజకీయ ప్రయోజనాల కోసమే రాహుల్ ఇలాంటి పనులు చేస్తున్నారని మండిపడ్డారు.

దళితులకు హక్కులు,రిజర్వేషన్లు కల్పించిన రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్‌‌కు వ్యతిరేకంగా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ పనిచేసిందని, ఆయన్ను ఎన్నికల్లో ఓడించిందని స్టేట్ బీజేపీ చీఫ్ గుర్తుచేశారు.కాంగ్రెస్ ఎన్నడూ అంబేడ్కర్‌కు భారతరత్న ఇవ్వలేదని, ఆయనను తీవ్రంగా అవమానించిందన్నారు. ఈ విషయంపై స్పందిస్తూ మల్లికార్జున ఖర్గే నిజంగా నిజమైన దళిత నేత అయితే వెంటనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని రామచందర్‌రావు డిమాండ్ చేశారు.

#Rahulgandi#kharge#ramleela ground#bjp cheif ramchandar rao#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి