National

RSS : ఆర్ఎస్ఎస్ మతాన్ని చూడదు..అలా చేస్తే హిందువులు అసలే కారు : చీఫ్ మోహన్ భగవత్

రచన: Kumar4 నిమిషాల పఠనం

ఆర్ఆర్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ముస్లింలను భారత్ నుంచి పంపించి వేయాలనుకునే వారు హిందువులు కారని ఆయన కీలక స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రస్తుతం దీనిపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది.

ఆర్ఆర్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ముస్లింలను భారత్ నుంచి పంపించి వేయాలనుకునే వారు హిందువులు కారని ఆయన కీలక స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రస్తుతం దీనిపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగిన ‘వన్ వరల్డ్ వన్ హ్యుమానిటీ’ కార్యక్రమంలో మోహన్ భగవత్ పాల్గొని ప్రసంగించారు.కార్యక్రమానికి హాజరైన పలువురు ఆర్ఎస్ఎస్ చీఫ్‌కు పలు ప్రశ్నలు సంధించారు. ఈ సందర్బంగా ఆయన ఎంతో ఓపికగా సమాధానాలు ఇచ్చినట్టు తెలిసింది.

తమను హిందూ దేశం నుంచి వెళ్లగొడతారా? అని గతంలో ముస్లిం ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయన తాజాగా న్యూయార్క్ వేదిక‌గా స‌మాధానం ఇచ్చారు. తమను తాము హిందువుగా చెప్పుకునే ప్రతి ఒక్కరూ అన్ని మార్గాలు(అన్ని మతాలు) ఒకే గమ్యస్థానానికి చేరుస్తాయని నమ్మాలని మోహన్ భగవత్ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరికీ ఆత్మగౌరవం ఉంటుందని, మనుషుల మధ్య ఎటువంటి వ్యత్యాసం లేదని వెల్లడించారు. గతంలో ఒక కార్యక్రమంలో ముస్లిం సోదరులు ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం, హిందూ దేశంలో తమ భవిష్యత్ గురించి ప్రశ్నించారని గుర్తుచేసిన ఆయన.. ముస్లింలను వెళ్లగొట్టడం హిందూత్వం కాదని స్పష్టంచేశారు.

ఆప‌ద‌ సమయంలో సేవ‌ చేయ‌డ‌మే ‘ధ‌ర్మం’ అని పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఓ ఘటనను ఆర్ఎస్ఎస్ చీఫ్ గుర్తుచేశారు. 1996లో హర్యానాలోని చార్ఖీ దాద్రీ వద్ద జరిగిన విమాన ప్రమాదాన్ని ఉటంకించారు. అరబ్ దేశాలకు చెందిన రెండు విమానాలు ఢీకొన్న ఘటనలో బాధితులంతా ముస్లింలే అని.. ఆ సమయంలో ఆర్‌ఎస్‌ఎస్ స్వయంసేవకులు తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టారని గుర్తుచేశారు.

మృతదేహాలను వెలికితీయడం నుంచిి అంత్యక్రియలు నిర్వహించే వరకు స్వయంసేవకులు బాధ్యత తీసుకున్నారని చెప్పారు. ఆ సమయంలో ఆర్ఎస్ఎస్ సేవకులు ఎవరూ వారి మతాన్ని చూడలేదని స్పష్టంచేశారు. వర్తమానంలో రాజకీయాలు స్వార్థపూరితంగా మారాయని, ఆర్‌ఎస్‌ఎస్ ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సమాజ సేవకే ప్రాధాన్యం ఇస్తుందని మోహ‌న్ భ‌గ‌వ‌త్ తెలిపారు.

https://x.com/NewsAlgebraIND/status/2093760017858183328?s=20

#RSS cheif mohan baghavath#newyork#religion#politics#Swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి