సినిమా

The Paradise: యేశనాగుల సాంగ్‌కి నెగిటివ్ ఫీడ్ బ్యాక్..?

రచన: Anshu4 నిమిషాల పఠనం

The Paradise: ఐటం సాంగ్ అంటే ఎలా ఉండాలి. ప్రతీ ఒక్కరితోనూ ఊర మాస్ స్టెప్పులేయించాలి. బాక్సులు బద్దలవ్వాలి..థియేటర్స్ దద్దరిల్లాలి. కానీ, తాజాగా 'ది ప్యారడైజ్' సినిమా నుంచి వచ్చిన డాన్స్ నంబర్ 'యేశనాగుల' సాంగ్‌కి నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తోంది. నాని, కీర్తి సురేష్‌లపై ఈ సాంగ్‌ను షూట్ చేశారు. ఆట సందీప్, ఆయన భార్య డాన్స్ కొరియోగ్రఫీ అందించారు. కానీ, ఆశించిన స్థాయిలో ఈ సాంగ్ లేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

'ది ప్యారడైజ్' సినిమాపై నాని అభిమానుల్లో, సినీ లవర్స్‌లో, ఫిల్మ్ సర్కిల్స్‌లో మంచి అంచనాలున్నాయి. ఇటీవల వచ్చిన టీజర్‌తోనూ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల భారీ హైప్‌ని క్రియేట్ చేశాడు. ఇక, ఇంతకముందు వచ్చిన 'ఆయా షేర్' సాంగ్ సినిమాకి మేజర్ ప్లస్ అవుతుందని సాంగ్ చూసిన ప్రతీ ఒక్కరు అభిప్రాయపడ్దారు. అలాంటి, సాంగ్స్ ఇంకా ఉన్నాయని మేకర్స్ ఊరించారు.

ఇక, గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో ప్రచారం అవుతూ బాగా అంచనాలు, ఆసక్తి రేకెత్తించిన సెకండ్ సింగిల్ 'యేశనాగుల సాంగ్‌ కొన్ని గంటల క్రితమే రిలీజైంది. అంతకముందు స్టేట్స్‌లో ఈ సాంగ్‌ని స్టేజ్‌పై పాడి నాని, సంగీత దర్శకుడు అనిరుధ్ హైప్ క్రియేట్ చేశారు. నానీకి ఫ్యాన్ ఫాలోయింగ్ విదేశాలలోనూ భారీగా ఉందని చెప్పుకున్నారు.

అయితే, తాజాగా వచ్చిన 'యేశనాగుల' సాంగ్‌కి మాత్రం నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తోంది. ఎంతో ఊహించుకుంటే, దానికి తగ్గట్టుగా డాన్స్ స్టెప్స్ లేవని..చాలా పేలవంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సాంగ్ కొరియోగ్రాఫర్స్ మీద కామెంట్స్ చేస్తున్నారు. బీట్ కి తగ్గ డాన్స్ మూవ్‌మెంట్స్ లేవని అంటున్నారు. స్పష్టంగా చూస్తే అదే అనిపిస్తోంది. అసలు, కీర్తి సురేష్ ఉషారుగా డాన్స్ చేయలేకపోయిందని అంటున్నారు. మరి, థియేటర్స్‌లో ఈ సాంగ్ ఏదైనా మ్యాజిక్ చేస్తుందేమో చూడాలి.

#Yeshanagula Video Song#The Paradise#Nani#Keerthy Suresh#Kayadhu Lohar
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి