నేపాల్‌ను భారీ వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. ప్రకృతి ప్రకోపించడంతో ఎంతో మంది ప్రాణాలను కోల్పోయారు. ప్రస్తుతం వరదలు తగ్గడంతో అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.భవన శిథిలాల కింద తవ్వేకొద్ది మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. మృతుల్లో ఎక్కువగా చిన్నారులు, మహిళలే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పొరుగుదేశం నేపాల్‌కు భారత్ మానవతా సాయం అందించేందుకు ముందుకు వచ్చింది.
పెద్దఎత్తున మెడిసిన్‌తో పాటు సహాయక చర్యలకు సంబంధించిన పరికరాలు, ఆర్మీ బృందాలను ఆ దేశానికి పంపించింది. ఇదిలాఉండగా, నేపాల్ వరదల ధాటికి పెద్దఎత్తున నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది.ప్రస్తుతం అధికారులు సంభవించిన మరణాలు, దెబ్బతిన్న నష్టాన్ని అంచనా వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే నేపాల్ ప్రజలు సాధారణ పరిస్థితులను చూస్తుండగా.. ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ NDRRMA కీలక హెచ్చరికలు జారీ చేసింది.
నేపాల్‌లో మళ్లీ వరదలు వచ్చే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. భోటేకోషి నదిలో నీటిమట్టం మరోసారి భారీగా పెరుగుతోందని, ఈ మేరకు శబ్దాలను గుర్తించినట్లు రసువా జిల్లా అడ్మినిస్ట్రేషన్ నుంచి సమాచారం వచ్చిందని వెల్లడించింది. రసువా, ధాండింగ్, నువాకోట్, చిత్వాన్ ప్రాంతాలు హై అలర్ట్‌లో ఉండాలని NDRRMA పలు సూచనలు చేసింది. కాగా, వరద ప్రభావిత ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశమూ ఉందని నేపాల్ వాతావరణ శాఖ వెల్లడించింది.
ఇదిలాఉండగా, నేపాల్ ఉత్తర భూభాగం,హిమాలయాలను అనుకుని ఉండే ప్రాంతంలో స్వల్ప భూకంపం రావడంతో భూమి లోపల ప్రవహిస్తున్న నది ఒక్కసారిగా ఉప్పొంగిందని..ఫలితంగా భోటేకోషి నదిలో నీటి మట్టం పెరిగి వరదలు సంభవించినట్టు అధికారులు పేర్కొన్నారు. కాగా, ఈ విలయంలో ఇప్పటివరకు 700 వరకు మరణాలు సంభవించగా..2 వేలకు పైగా ప్రజలు గల్లంతయ్యారు.అందులో భారతీయులు కూడా ఉన్నారని తెలిసింది. సుమారు 500 మంది వరకు భారతీయులు ప్రమాదంలో చిక్కుకున్నారని అధికారులు లెక్కలు వేస్తున్నారు.
https://x.com/pulsenewsbreak/status/2093942192276672768?s=20












