Trivikram: గత కొంతకాలంగా మన తెలుగు సినిమాలలో ఓల్డ్ ఛార్ట్ బస్టర్స్ ని మళ్ళీ రీమిక్స్ చేసి సినిమాలలో ప్రత్యేక సందర్భంలో ఉపయోగిస్తున్నారు. అలా, రీమిక్స్ చేసిన చాలా సాంగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు, కూడా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆయన దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా నటిస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమా కోసం వెంకీ నటించిన కూలీ నంబర్ 1 లోని 'దండాలయ్యా ఉండ్రాళ్ళయ్య' సాంగ్‌ను రీమిక్స్ చేస్తున్నారట.
గతంలో వచ్చిన కొన్ని రీమిక్స్ సాంగ్స్:
'పోకిరి' సినిమాలోను 'గల గల పాడుతున్న గోదారిలా' సాంగ్‌ని మెలోడి బ్రహ్మ మణిశర్మ రీమిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సాంగ్ సూపర్ స్టార్ కృష్ణ నటించిన 'గౌరి' సినిమాలోనిది. మహేష్ బాబు నటించిన 'పోకిరి' కోసం రీమిక్స్ చేశారు. కొంత లిరిక్స్ కూడా మార్చారు. ఈ సాంగ్ సూపర్ హిట్ అయింది. 'మగధీర' సినిమాలోను మెగాస్టార్ నటించిన 'ఘరానా మొగుడు' సినిమాలోను 'బంగారు కోడిపెట్ట' పాటను రీమిక్స్ చేశారు.
మాజ్ జాతర సినిమాలోనూ రవితేజ నటించిన ఇడియట్ సినిమాలోను పాటను రీమీక్స్ చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా సంగీత దర్శకుడు చక్రీ వాయిస్ ను కూడా దింపారు. సాయి ధరమ్ తేజ్ నటించిన సుప్రీమ్ మూవీ కోసం కూడా యముడికి మొగుడు సినిమాలోని అందం హిందోళం సాంగ్ రీమిక్స్ చేశారు. ఇలా, ఇప్పటికే, చాలా సినిమాలలోని సూపర్ హిట్స్ సాంగ్స్ రీమిక్స్ అవుతున్నాయి.
కూలీ నంబర్ నుంచి దండాలయ్యా ఉండ్రాళ్ళయ్య..
వెంకటేష్, శ్రీనిధి శెట్టి జంటగా నటిస్తున్న కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం’. ఈ సినిమాలో ఓ సిచ్యువేషన్ క్రియేట్ చేసి త్రివిక్రమ్ అందుకు తగ్గట్టుగా కూలీ నంబర్ 1 లోనీ బ్లాక్ బస్టర్ హిట్ సాంగ్ దండాలయ్యా ఉండ్రాళ్ళయ్య పాటను రీమిక్స్ చేయిస్తున్నాడట. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.థమన్ రీమిక్స్ కోసం సూపర్ ట్యూన్ రెడీ చేశాడట. టబును టీజ్ చేస్తూ వినాయకుడి విగ్రాన్ని తలపై మోయిస్తూ పాడిన పాట ప్రతీ వినాయకచవితికి వినిపిస్తుంది. ఇప్పుడు, అలాంటి సూపర్ హిట్ సాంగ్ రీమిక్స్ అంటే ఎలా ఉంటుందో చూడాలి.












