Health

Health.. అరటిపండుతో తక్షణ శక్తి.. కానీ వీరు మాత్రం కాస్త జాగ్రత్త!..

రచన: Venu••4 నిమిషాల పఠనం

అరటిపండు ప్రకృతి మనకిచ్చిన అద్భుతమైన వరం మాత్రమే కాదు.. మన చేతిలో ఉండే న్యాచురల్ ఎనర్జీ బూస్టర్ కూడా.. అందుకే రోజు ఒక్క అరటిపండు తింటే చాలు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతారు.

అరటిపండు ప్రకృతి మనకిచ్చిన అద్భుతమైన వరం మాత్రమే కాదు.. మన చేతిలో ఉండే న్యాచురల్ ఎనర్జీ బూస్టర్ కూడా.. అందుకే రోజు ఒక్క అరటిపండు తింటే చాలు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతారు. ఇందులో ఉండే పొటాషియం, ఫైబర్, విటమిన్ B6 గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, జీర్ణక్రియను సజావుగా ఉంచుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతారు.

కానీ కొన్ని ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా శ్వాసకు సంబంధించిన ఆస్తమా ఉన్నవారు అరటిపండును తినవచ్చా అనే సందేహం చాలా మందికి కలుగుతుంది. అయితే అలాంటి వారికి అరటిపండు ప్రత్యేకంగా నిషేధం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. కానీ అరటిపండు తిన్న ప్రతిసారీ శ్వాసలో ఇబ్బంది, దగ్గు లేదా ఈలల శబ్దంతో కూడిన శ్వాస పెరుగుతుంటే మాత్రం దాన్ని నిర్లక్ష్యం చేయకూడదని సూచిస్తున్నారు.

ఇక అరటిపండులో పొటాషియం, విటమిన్ బి6, ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి. సమతుల్య ఆహారంలో భాగంగా తీసుకుంటే ఇవి శరీరానికి ఉపయోగకరమే. కొన్ని పరిశీలనా అధ్యయనాల్లో పిల్లలు అరటిపండును ఎక్కువగా తీసుకోవడం, వీజింగ్ తక్కువగా ఉండటంతో సంబంధం ఉన్నట్లు కనిపించింది. అయితే దీన్ని బట్టి అరటిపండు ఆస్తమాను తగ్గిస్తుంది లేదా చికిత్స చేస్తుందని చెప్పడానికి తగిన ఆధారాలు లేవు.

మరోవైపు అరటిపండు అందరికీ సరిపడుతుందా అంటే... కొంతమంది జాగ్రత్తగా ఉండాల్సిందే! భారతదేశంలో జరిగిన కొన్ని అధ్యయనాల ప్రకారం, ఆస్తమా ఉన్న కొందరు పిల్లల్లో అరటిపండు అలెర్జీని ట్రిగ్గర్ చేయవచ్చు. ఇది తిన్న కొద్దిసేపటికే నోరు లేదా గొంతులో దురద, పెదవుల వాపు, దద్దుర్లు, దగ్గు లేదా ఆయాసం కనిపిస్తే... వెంటనే తినడం ఆపేసి, వైద్యుడిని సంప్రదించాలి.

ఇక అరటిపండు గురించి సమాజంలో కొన్ని అపోహలు కూడా ఉన్నాయి. అరటిపండు తింటే శ్వాసనాళాలు కుంచించుకుపోతాయని చెప్పడానికి బలమైన వైద్య ఆధారాలు లేవు. అలాగే, ఆస్తమా ఉన్నవారు రాత్రిపూట తినకూడదని, కేవలం ఉదయమే తినాలనే నిర్దిష్ట నియమం కూడా ఏదీ లేదు. కాబట్టి... మీకు ఎలాంటి అలెర్జీ లేకపోతే, తగిన మోతాదులో అరటిపండును తీసుకోవచ్చు. అయితే ఆస్తమా నియంత్రణకు డాక్టర్ సూచించిన ఇన్హేలర్లు, సరైన మందులే ముఖ్యం... ఎందుకంటే మంచి ఆహారం ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది, కానీ చికిత్సకు ప్రత్యామ్నాయం కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..

ముఖ్య గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇది నిపుణుల లేదా వైద్యుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునే ముందు ఖచ్చితంగా మీ డాక్టర్‌ను సంప్రదించాల్సిందిగా మనవి!..

#Health#banana#energy#people#careful#Asthma
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి