తెలంగాణ

TG : ఆర్టీసీ ఎన్నికల వేళ టీపీసీసీ చీఫ్ సంచలన ప్రకటన..

రచన: Kumar••4 నిమిషాల పఠనం

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.త్వరలోనే ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 9న జరగనున్న ఆర్టీసీ యూనియన్ ఎన్నికల్లో 'తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్' (TWU - రిజిస్ట్రేషన్ నంబర్ : 4-4522)కు అధికార కాంగ్రెస్ తరపున పూర్తి మద్దతు ఇస్తున్నట్టు టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు.

ఈ మేరకు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులకు సమాచారం అందించారు. టీడబ్ల్యూయూ యూనియన్ కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా పనిచేస్తోందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల (DCC), సిటీ (CCC) కాంగ్రెస్ అధ్యక్షులకు, ఎమ్మెల్యేలకు ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు.నేతలు తమ నియోజకవర్గాల పరిధిలోని ఆర్టీసీ డిపోలలో కాంగ్రెస్ అనుబంధ టీడబ్ల్యూయూ యూనియన్‌కు సంపూర్ణ సహకారాన్ని, సమన్వయాన్ని అందించాలని ఆదేశాలు జారీ చేశారు.ఇతర ఏ యూనియన్లను ప్రోత్సహించవద్దని స్పష్టంచేశారు.

అయితే, ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార కాంగ్రెస్ పార్టీ.. క్షేత్రస్థాయిలో సమన్వయం కోసం ప్రత్యేక ఇన్‌చార్జిని నియమించింది. టీపీసీసీ ఉపాధ్యక్షులు, గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌ను ఈ ఎన్నికల సమన్వయకర్తగా నియమిస్తున్నట్టు టీపీసీసీ చీఫ్ వెల్లడించారు. బొంతు రామ్మోహన్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు, ఆర్టీసీ కార్మికులు సమన్వయంతో పనిచేసి టీడబ్ల్యూయూ విజయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఇదిలాఉండగా, ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలను అధికార కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకోగా.. త్వరలో రానున్న ఖైరతాబాద్ అసెంబ్లీకి బై ఎలక్షన్,వచ్చే ఏడాది ప్రారంభంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికల్లో గెలిస్తేనే రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటాలని..జనరల్ ఎలక్షన్స్‌లోనూ పైచేయి సాధించవచ్చని కాంగ్రెస్ పార్టీ యోచిస్తున్నట్టు సమాచారం.అందుకే రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే రాష్ట్రస్థాయి నేతలకు సూచనలు చేసినట్టు తెలుస్తోంది.

#Tpcc cheif mahesh goud#RTC labour elections#hyderabad#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి