తెలంగాణ

TG : అర్ధరాత్రి గురుకులంలో కలకలం.. ఆస్పత్రిలో 14 మంది విద్యార్థినులు

రచన: Kumar••3 నిమిషాల పఠనం

రాష్ట్రంలో మరో దారుణం చోటుచేసుకుంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకులాల్లో అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో బాలబాలికలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.మొన్నటివరకు ఫుడ్ పాయిజన్ ఘటనలు గురుకులాల్లో రిపీట్ అవ్వగా.. తాజాగా మరో సమస్య వారిని వెంటాడుతోంది.

రాష్ట్రంలో మరో దారుణం చోటుచేసుకుంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకులాల్లో అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో బాలబాలికలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.మొన్నటివరకు ఫుడ్ పాయిజన్ ఘటనలు గురుకులాల్లో రిపీట్ అవ్వగా.. తాజాగా మరో సమస్య వారిని వెంటాడుతోంది. అపరిశుభ్రత, నీటి సమస్యలకు తోడు కొత్తగా ఎలుకల భయం విద్యార్థినులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నట్టు తెలిసింది.

జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఎలుకలు విద్యార్థినులను కరిచాయి.అర్ధరాత్రి విద్యార్థులు నిద్రిస్తున్న సమయంలో 14 మందిని ఎలుకలు కరిచినట్లు సమాచారం. విద్యార్థినుల చేతులు, కాళ్లపై ఎలుకలు కరవడంతో వారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.రాత్రంతా విద్యార్థినులు ఏడుస్తూ కూర్చున్నట్టు సమాచారం.

విషయం తెలుసుకున్న పాఠశాల సిబ్బంది వెంటనే బాధిత విద్యార్థినులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.ఒకేసారి 14 మంది విద్యార్థినులను ఎలుకలు కరవడంతో పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. పాఠశాలలో ఎలుకల బెడద, విద్యార్థినుల భద్రతకు అధికారులు ఏం చర్యలు తీసుకుంటున్నారని బాధిత పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు.

పాఠశాలలో భద్రత లేకుండా తమ పిల్లలను ఎలా పంపించాలని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురుకులంలో వెంటనే పిల్లల భద్రత కోసం చర్యలు చేపట్టాలని, ఈ ఘటనకు బాధ్యులైన వారి మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలాఉండగా, గతంలో ఫుడ్ పాయిజన్ ఘటనలు జరిగి బాలబాలికలు ఆస్పత్రుల పాలయిన విషయం తెలిసిందే. ఇన్ని ఘటనలు జరుగుతున్నా అధికారులు, ప్రభుత్వం తీరులో మాత్రం ఎలాంటి చలనం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

#Rat bites#janagam#telangana#students#hospitalised#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి