తెలంగాణ

TG : శోభాయాత్రలో పోలీసులు.. పీఎస్‌‌‌లో రెండు కుటుంబాల ఫైటింగ్

రచన: Kumar••3 నిమిషాల పఠనం

రాష్ట్రంలో గణనాథుల నిమజ్జనాలు కొనసాగుతుండగా పోలీసులు విధుల్లో నిమగ్నం అయ్యారు.ట్రాఫిక్ క్లియరెన్స్, వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరిస్తున్నారు.ఈ క్రమంలోనే రెండు కుటుంబాలు పోలీస్ స్టేషన్‌లో నానా రభస చేశాయి. స్టేషన్ ప్రాంగణంలో ఇరువర్గాలు దాడులకు పాల్పడ్డాయి.

రాష్ట్రంలో గణనాథుల నిమజ్జనాలు కొనసాగుతుండగా పోలీసులు విధుల్లో నిమగ్నం అయ్యారు.ట్రాఫిక్ క్లియరెన్స్, వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరిస్తున్నారు.ఈ క్రమంలోనే రెండు కుటుంబాలు పోలీస్ స్టేషన్‌లో నానా రభస చేశాయి. స్టేషన్ ప్రాంగణంలో ఇరువర్గాలు దాడులకు పాల్పడ్డాయి. దీనికి వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకోగా.. ఈ గొడవకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

వివరాల్లోకివెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. వివాహేతర సంబంధం వ్యవహారంలో మొదలైన వివాదం కాస్త తొలుత మాటల యుద్ధం, ఆపై పరస్పర దాడులకు దారితీసింది.ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ ఇరువర్గాలు పీఎస్‌లోకి దూసుకెళ్లాయి.

అనంతరం స్టేషన్‌లోనూ పరస్పరం దాడులు చేసుకున్నట్టు తెలిసింది. వినాయక నిమజ్జనం బందోబస్తు విధుల్లో త్రీ టౌన్ పోలీసులు ఉండగా.. సిబ్బంది తక్కువగా ఉండటంతో పోలీస్‌స్టేషన్‌లోనే రెండు కుటుంబాలు హల్‌చల్ చేశాయి. పదుల సంఖ్యలో పీఎస్‌కు చేరుకుని కర్రలతో దాడులకు పాల్పడినట్టు సమాచారం.ఆ సమయంలో అక్కడే ఉన్న నైట్ డ్యూటీ కానిస్టేబుళ్లు వెంటనే అప్రమత్తమయ్యారు. ఇరువర్గాలను చెదరగొట్టారు.

ఘర్షణకు పాల్పడిన కొంతమందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాయి. ఓ యువకుడు స్థానికంగా ఉంటున్న మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో వివాదం చెరరేగినట్టు సమాచారం. ఈ విషయం ఇరుకుటుంబాలకు తెలియడంతో పరస్పరం దాడులు చేసుకున్నట్టు తెలిసింది.కాగా, పోలీస్‌స్టేషన్‌లో దాడులకు పాల్పడిన ఘటనలో పలువురిపై కేసుులు నమోదు అయినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

#kottagudem police station#two families#fight#extramarrital affair#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి