తెలంగాణ

Crime : శోభాయాత్రలో విషాదం.. వాహనం కింద పడి యువకుడి దుర్మరణం

రచన: Kumar••4 నిమిషాల పఠనం

హైదరాబాద్ మహానగరంలో తీవ్ర విషాదం నెలకొంది. ఖైరతాబాద్ గణేశుల శోభాయాత్రలో భాగంగా ప్రమాదవశాత్తు ఓ యువకుడు వాహనం కింద పడి మరణించాడు. గంగమ్మ ఒడికి చేరేందుకు వినాయకులు వడివడిగా ట్యాంక్ బండ్ వద్దకు వస్తున్న క్రమంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

హైదరాబాద్ మహానగరంలో తీవ్ర విషాదం నెలకొంది. ఖైరతాబాద్ గణేశుల శోభాయాత్రలో భాగంగా ప్రమాదవశాత్తు ఓ యువకుడు వాహనం కింద పడి మరణించాడు. గంగమ్మ ఒడికి చేరేందుకు వినాయకులు వడివడిగా ట్యాంక్ బండ్ వద్దకు వస్తున్న క్రమంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరోవైపు సెక్రెటేరియట్ ముందు నుంచి ఖైరతాబాద్ బడా గణేశ్ శోభాయాత్ర సాగుతోంది. అయితే, మహాగణపతి శోభాయాత్రను వీక్షించేందుకు లక్షలాది భక్తులు ట్యాంక్ బండ్ వద్దకు చేరుకుంటున్నారు.ఈ క్రమంలోనే సచివాలయం, నెక్లెస్ రోడ్, ఖైరతాబాద్ పరిసరాల్లో భారీగా రద్దీ నెలకొంది.

అయితే, ట్రాఫిక్ రద్దీని క్లియర్ చేసే క్రమంలో పోలీసులు స్వల్పంగా లాఠీచార్జ్ చేయగా.. ఓ యువకుడు నిమజ్జనకోసం తరలుతున్న వాహనంపైకి ఎక్కే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు జారి కిందపడగా వాహనం మీద నుంచి వెళ్లింది. దీంతో అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. మెట్రో పిల్లర్‌ నంబర్‌ 1167 వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న సివిల్ పోలీసులు వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు తెలుస్తోంది. పోలీసుల అత్యుత్సాహం వల్లే ఈ ప్రమాదం జరిగిందని మృతుడి స్నేహితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం నడిరోడ్డు మీద ఆందోళనకు దిగారు. రద్దీని నియంత్రించే క్రమంలో పోలీసులు ఒక్కసారిగా లాఠీఛార్జ్ చేశారని, ఆ దెబ్బలకు భయపడి పరుగులు తీసే క్రమంలోనే తమ స్నేహితుడు వాహనం కింద పడి ప్రాణాలు కోల్పోయాడని ఆరోపించారు.

తమ మిత్రుడి మరణానికి న్యాయం చేయాలంటూ స్నేహితులు, స్థానిక యువకులు రోడ్డుపై బైఠాయించారు.ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. రంగంలోకి దిగిన పోలీస్ అధికారులు నిరసనకారులతో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ప్రమాద ఘటనపై సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పరిశీలించి సమగ్ర దర్యాప్తు జరుపుతామని హామీ ఇవ్వడంతో ఆందోళన కారులు వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది.

#Accident#ganesh shobayatra#kairatabad#crime#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి