సినిమా

Fauzi: నెలరోజులు ప్రభాస్‌ను లాక్ చేసిన దర్శకుడు!

రచన: Anshu3 నిమిషాల పఠనం

Fauzi: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్‌ను ఒక దర్శకుడు నెలరోజుల పాటు వేరే సినిమా షూటింగ్‌లో గానీ, ఇతర కార్యకలాపాలకి గానీ వెళ్ళకుండా లాక్ చేసినట్టుగా తెలుస్తోంది. ఆ దర్శకుడే, హను రాఘవపూడి. వీరి కాంబినేషన్‌లో ఫౌజీ అనే పీరియాడికల్ సినిమా అత్యుత్తమ ప్రమాణాలతో తెరకెక్కుతోంది.

Fauzi: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్‌ను ఒక దర్శకుడు నెలరోజుల పాటు వేరే సినిమా షూటింగ్‌లో గానీ, ఇతర కార్యకలాపాలకి గానీ వెళ్ళకుండా లాక్ చేసినట్టుగా తెలుస్తోంది. ఆ దర్శకుడే, హను రాఘవపూడి. వీరి కాంబినేషన్‌లో ఫౌజీ అనే పీరియాడికల్ సినిమా అత్యుత్తమ ప్రమాణాలతో తెరకెక్కుతోంది.

ఇప్పటి వరకూ దర్శకుడు హను రాఘవపూడి ఇంత భారీ స్కేల్ సినిమాను చేయలేదు. ప్రభాస్‌తో మైత్రీ వారి నిర్మాణంలో రూపొందుతున్న ఫౌజీ చిత్రమే మొదటిది. ఇమాన్వీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల చిత్ర నిర్మాతలలో ఒకరైన రవి శంకర్ డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా ఫౌజీ రిలీజ్ కాబోతుందని, డిసెంబర్ 2వ తేదీన ప్రీమియర్స్ ఉండబోతున్నాయని కన్‌ఫర్మ్ చేశాడు.

ఈ నేపథ్యంలో, ఇంకా 50 రోజుల టాకీ పార్ట్ షూట్ కంప్లీట్ చేయాల్సి ఉంది. ఇందులో ప్రభాస్ తో చేయాల్సిన సీన్స్ కోసమే 30 రోజులు డేట్స్ లాక్ చేసినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఫౌజీ కోసం వేసీ ప్రత్యేకమైన సెట్‌లో ఈ నెల 3వ తేదీ నుంచి చిత్రీకరణ స్టార్ట్ అయింది. ఈ సెట్స్‌లో ప్రభాస్ జాయిన్ అయ్యాడు. కంప్లీట్ గా ఈ నెలరోజుల పాటు వేరే పనులేవీ కమిటవకుండా ఫౌజీ కోసమే డేట్స్ ఇచ్చాడు ప్రభాస్.

ఈ ముప్పై రోజుల పాటు ప్రభాస్ పై తీయాల్సిన అన్నీ సీన్స్ కంప్లీట్ చేయనున్నారు. అలాగే, తర్వాత 20 రోజులు బ్యాలెన్స్ టాకీ పార్ట్ ఫినిష్ చేయడానికి షెడ్యూల్ ప్లాన్ చేశారట. ఇంకోవైపు పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్‌ను చేస్తూ వస్తోంది టీమ్. డిసెంబర్ టార్గెట్ గా పెట్టుకున్న మేకర్స్ ఆ దిశగానే ఫౌజీ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు రెడీ అవుతున్నారు.

#fauzi#hanuraghavapudi#prabhas#imanvi
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి