తెలంగాణ

TG : చేతిలో డిగ్రీ పట్టాలు..జాబ్‌మేళాకు పోటెత్తిన నిరుద్యోగులు

రచన: Kumar4 నిమిషాల పఠనం

రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం జాబ్‌మేళాను నిర్వహిస్తోంది. శనివారం కోదాడ పట్టణంలోని సీసీ రెడ్డి కాన్వెంట్‌లో నిర్వహించిన మెగా జాబ్‌మేళాకు పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు తరలివచ్చారు. ఉదయం నుంచే అభ్యర్థులు భారీగా తరలి రావడంతో కాన్వెంట్ ప్రాంగణం కిక్కిరిసిపోయింది.

రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం జాబ్‌మేళాను నిర్వహిస్తోంది. శనివారం కోదాడ పట్టణంలోని సీసీ రెడ్డి కాన్వెంట్‌లో నిర్వహించిన మెగా జాబ్‌మేళాకు పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు తరలివచ్చారు. ఉదయం నుంచే అభ్యర్థులు భారీగా తరలి రావడంతో కాన్వెంట్ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఉద్యోగం కోసం వచ్చిన అభ్యర్థులు ముందుగా పేర్లను నమోదు చేసుకుని, అర్హతలకు అనుగుణంగా కేటాయించిన స్టాల్స్‌ వద్దకు చేరుకున్నట్టు సమాచారం.

స్టాల్స్‌ వద్ద అభ్యర్థులు క్యూ లైన్లలో నిలబడి వివిధ కంపెనీల ప్రతినిధులు నిర్వహించిన ఇంటర్వ్యూలు, ఇతర ఎంపిక ప్రక్రియల్లో పాల్గొన్నారు. వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో యువత నుంచి భారీ స్పందన కనిపించింది. జాబ్‌మేళాకు పెద్దఎత్తున అభ్యర్థులు తరలిరావడంతో నిర్వాహకులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లు, స్టాల్స్‌ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉద్యోగం కోసం వచ్చిన ప్రతి అభ్యర్థికీ అవకాశం కల్పించేలా ఎంపిక ప్రక్రియ కొనసాగినట్టు తెలుస్తోంది.

అయితే, జాబ్‌మేళా సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. భారీగా నిరుద్యోగులు రావడంతో రద్దీ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించారు. స్థానిక జిల్లా ఎస్పీ నరసింహ స్వయంగా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రభుత్వం నిర్వహించిన ప్రత్యేక జాబ్ ప్రోగ్రామ్ కావడంతో భారీగా పోలీసు సిబ్బందిని భద్రతా పర్యవేక్షణ కోసం విధుల్లో ఉంచారు. ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు లేకుండా అభ్యర్థులు ప్రశాంత వాతావరణంలో ఇంటర్వ్యూలకు హాజరయ్యేలా చర్యలు చేపట్టారు.

కాగా, ఉద్యోగం కోసం పెద్దఎత్తున యువత ఒకే వేదిక వద్దకు రావడంతో సీసీ రెడ్డి కాన్వెంట్‌ పరిసరాల్లో సందడి నెలకొంది.పిల్లలతో పాటే వారి తల్లిదండ్రులు కూడా జాబ్ మేళాకు వచ్చినట్టు తెలిసింది. పిల్లలను అక్కడ డ్రాప్ చేసి వారంతా బయట ఎదురుచూస్తున్నట్టు సమాచారం. అభ్యర్థులు తమ అర్హతలకు తగిన ఉద్యోగం లభిస్తుందనే ఆశతో ఉత్సాహంగా ఇంటర్వ్యూలకు హాజరైనట్టు తెలిసింది.ఈ జాబ్‌మేళాను స్థానిక నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం,జిల్లా అధికార యంత్రాంగం పిలుపునిచ్చింది.

#mega job mela#kodada#congress Government#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి