స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్

పాచిపోయిన ఫాంహౌజ్‌ల గోల వద్దు?

రచన: Mamatha puppala7 నిమిషాల పఠనం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కమ్మ కులస్తులు ఎంతో వివాదాస్పద జూబ్లీహిల్స్, మాదాపూర్, కూకట్ పల్లి లాంటి ఏరియాలు కబ్జా పెట్టారు. అదే కారణంతో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. కేసీఆర్ లాంటి పొలిటీషియన్‌కు అర్ధమయ్యే తెలంగాణ గడ్డపై బతికే వారికి భూమిపై సొయి లేదు.

  • పాలకులపై భూ ఫైటింగ్ పార్ట్-1

  • పాలకుల భూ దోపిడీ కంట్రోల్ చేస్తారా?

  • బినామీలను బయట పెడతారా?

  • గ్రామాల్లో ఎకరాలు కాదు.. సిటీలో గజాల్లో మీకు ఉన్న ఆస్తుల విలువలు చెబుతారా?

  • జీఎస్టీ, ఇన్‌కం ట్యాక్స్ మోసాలను ఎలా కంట్రోల్ చేశారో..

  • స్టేట్‌లో భూ వ్యత్యాసాలను సరి చేసే సత్తా ఉందా?

  • అధికార పార్టీ రాజకీయ పబ్బంలో ప్రతీకార చర్యలు ఎన్నో చూశాం?

  • 5 ఏండ్ల క్రితం బీసీ బిడ్డ ఈటలకి ఇదే కదా జరిగింది

  • ఇవాళ అదే సర్వేల పేరుతో అధికార మదం చూపించే ప్రయత్నంతో ఏం సాధిస్తారు?

  • ఎకరాలు కాదు.. మాకు ఆర్ధిక వ్యత్యాసాలు ఏంటో చూపించాలి

  • నాయకుల మాటున నేతల భూ దోపిడీపై స్వేచ్ఛ న్యూస్ ప్రత్యేక కథనం

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల,

9848070809,

స్వేచ్చ న్యూస్ చైర్మన్.

అర్థం చేసుకుంటే అసలు తెలంగాణ ఉద్యమం భూ దోపిడీదారులపైనే కొట్లాట

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కమ్మ కులస్తులు ఎంతో వివాదాస్పద జూబ్లీహిల్స్, మాదాపూర్, కూకట్ పల్లి లాంటి ఏరియాలు కబ్జా పెట్టారు. అదే కారణంతో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. కేసీఆర్ లాంటి పొలిటీషియన్‌కు అర్ధమయ్యే తెలంగాణ గడ్డపై బతికే వారికి భూమిపై సొయి లేదు. అంటూ నీళ్లు, నిధులు, నియమాకాల పేరుతో ప్రారంభించారు. కానీ, కల సాకారం అయ్యేలా ఉందని భూమిపై ముందుగానే ఆశతో కేసీఆర్ ఎలాంటి లాభాపేక్ష లేకుండా పేరు కోసం భూమి కొనుగోలు చేసుకున్నారు. ఆనాటికి ఈ చోటా లీడర్స్ బతుకులు తెలంగాణ సమాజానికి తెలుసు. కేసీఆర్‌తో భజన బ్యాచ్‌లో అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు కావడంతో కనీసం మంత్రులుగా కూడా పనికి రాలేని పరిస్థితి అనుకుంటూ, రాజకీయ అనుభవం పేరుతో తలుపులు తెరిచారు. అది భూ దోపిడీ బ్యాచ్ అని తెలియదు. వాళ్లను చూసి దొరల పాలన ఎలా ఉండాలో అసలైన వెలమ దొరలు నేర్పించారు. అందుకే నమస్తే తెలంగాణ ఓనర్స్‌ని మార్చి దామోదర్ రావు లాంటి వాళ్లను చేర్చుకుని ఎంపీ సీట్ ఇచ్చారు. మందులు ఇచ్చే సంతోష్‌ని ఎంపీగా చేశారు. డబ్బులు ఇచ్చే ఎంతోమంది బిజినెస్ మాన్స్‌కి మేమే దిక్కు అన్నట్లు 10ఏళ్ల పాలన చేశారు. ఇలా సొంతింటి వాళ్లకు, అర్ధికంగా ఉన్న వాళ్లకే లాభాలు, పదవులు ఇచ్చారు.

అధికారం ఉంటే ఎలాంటి మదం ఉంటుందో బీఆర్ఎస్‌కే బాగా తెలుసు

తెలంగాణ ఉద్యమం పేరుతో ఎన్నిసార్లు రాజీనామా చేసినా కేసీఆర్ ఇప్పటికి 14 సార్లు ఎన్నికల్లో ఓటమి ఎరగని నేత. ఆలాంటిది రాజీనామా చేయి అంటూ సీఎం రెచ్చగొట్టినా, ఫాంహౌజ్‌లోనే సైలెంట్‌గా ఉంటున్నారు. ఆయన రాజకీయంగా పైచేయి సాధించేందుకు చేయాల్సిన డ్రామాలు ఎన్నో చేశారు. అధికారం వచ్చాక ఈటల విషయంలో, హరీశ్ రావు అతి తెలివి ఏంటో తెలుసుకుని చెక్ పెట్టారు. కానీ, ఆర్థికంగా విపరీతమైన డబ్బులు రావడంతో దేశాన్ని ఏలాలి అనే మైండ్ సెట్ ఉండటంతో గొడవలు పుట్టాయి. పతనం ప్రారంభం అయింది. అధికారంలో ఉన్నప్పుడు కోట్ల రూపాయల విలువను కూడా వెయ్యి రూపాయలకు లెక్క చేయలేదు. ఇప్పుడు మీ లెక్కల ఆర్ధిక వ్యవస్థపై వచ్చే సరికి ఇంతలా ఎందుకు భయం.

రేవంత్.. మీ లెక్కలు చాలానే ఉన్నాయి

మీరిచ్చిన హామీల్లో ఒక్కటైనా నేరవేర్చారా? తెలంగాణ ఉద్యమంలో కడుపు కాల్చుకుని, దెబ్బలు తిని, యుక్త వయస్సుల్లో 10ఏళ్ల కెరియర్‌‌ని వదులుకుని పోరాడిన మిత్రులు ఎందరో, నాలాంటి వాళ్లం తెలివిగా మీడియాలో చేరి మా ఆలోచనలతో 10మందిని తయారు చేసేలా చేశాం. ఆనాడు ఉద్యమకారులపై హైకోర్టు ఆదేశాలు ఇస్తే కాని ఫైల్ కదలలేదు. ఉద్యమంలో పాల్గొన పొలిటీషియన్స్ ఎన్నో కోట్లకు ఎదిగారు. కార్యకర్తలు మాత్రం ఎక్కడివారు అక్కడే ఉన్నారు. ఆనాడు పార్లమెంట్ సాక్షిగా పోరాడిన ఎంపీలు అయిన పొన్నం, వివేక్, రాజగోపాల్, బలరాం, రాజయ్య లాంటి వాళ్లు ఎన్ని పాట్లు పడ్డారో మా తెలంగాణ ఉద్యమకారులకే తెలుసు. ఆనాడు మీరు ఎక్కడ ఎలాంటి లాభాపేక్ష పోస్ట్ కోసం వెతుకుంటూ ఉన్నారో తెలియదు. కానీ, ఇప్పుడు భూముల విలువను చెప్పారు. అదేవిధంగా వ్యత్యాసాలను కూడా చెప్పండి.

ఆర్థిక వ్యత్యాసాలు తెలుసుకోని కమ్యూనిస్టుల గురించి మాట్లాడండి

మీరు ప్రభుత్వంలో మార్కెట్‌లో భూమిని అమ్మిన రేట్ ప్రకారం రూ.2.5లక్షల ధర ఒక్క గజానికి పలికింది. ఎకరం అయితే 269 కోట్లు ప్రభుత్వానికి వచ్చేలా అమ్మేశారు. కానీ, అదే 200 కిలోమీటర్ల దూరం కూడా లేని గ్రామాల్లో ఎందుకు రూ.20లక్షల లోపు దొరుకుతున్నాయి. వెయ్యి గజాలు ఉండే వాడికి ఇక్కడ రూ.25 కోట్ల విలువ చేస్తోంది. కానీ, అదే 30 కిలోమీటర్ల దూరంలో ఉండే వాడికి వెయ్యి గజాలకు కోటి రూపాయలు కూడా రావడం లేదు. ఏంటీ వ్యత్యాసం. భూమిపై తెలివి ఉన్నవాడే శాసిస్తాడు. చరిత్ర అదే చెబుతోంది. ప్రపంచం అదే బాటగా ఆలోచించాలి.

#elanganaPolitics#SwetchaNews#LandScamTelangana#DevenderReddyChintakuntla#RevanthReddy#KCR#BRSVsCongress#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి