సినిమా

Keerthy Suresh: మగవాళ్ళు ఏడవకూడదా? కీర్తి షాకింగ్ కామెంట్స్!

రచన: Anshu4 నిమిషాల పఠనం

Keerthy Suresh: సౌత్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న సినిమా ‘డోరతి’. కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. దర్శకుడి టేకింగ్, ఇళయరాజా సంగీతం, అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రీమియర్ వంటి అంశాలతో ఈ సినిమా అందరిలోనూ విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే, తాజాగా ఈ సినిమా గురించి 'మగవాళ్ళు ఏడవకూడదా'.. అంటూ కీర్తి చెప్పిన మాట నెట్టింట వైరల్ అవుతోంది.

Keerthy Suresh: సౌత్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న సినిమా ‘డోరతి’. కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇది, కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తున్న సినిమా అని మాత్రమే కాకుండా, కథా నేపథ్యం, దర్శకుడి టేకింగ్, ఇళయరాజా సంగీతం, అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రీమియర్ వంటి అంశాలతో ఈ సినిమా అందరిలోనూ విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే, తాజాగా ఈ సినిమా గురించి 'మగవాళ్ళు ఏడవకూడదా'.. అంటూ కీర్తి చెప్పిన మాట నెట్టింట వైరల్ అవుతోంది.

కీర్తి సురేష్ ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తెలుగుతో పాటుగా తమిళం, హిందీ, మలయాళ చిత్రాల్లో నటిస్తూ తీరిక లేకుండా గడుపుతోంది. తన సినిమా షూటింగ్స్‌తో ఎంత బిజీగా ఉంటున్నారనే విషయాన్ని తెలుపుతూ ఇటీవల కీర్తి ఓ వీడియోను తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో షేర్ చేసింది. కంటిమీద కునుకు లేకుండా ఒక సినిమా తర్వాత ఒకటి షూటింగ్స్ చేస్తూనే ఉన్నట్లు కీర్తి వెల్లడించింది. ఈ క్రమంలో చేస్తోన్న లేటెస్ట్ సినిమా ‘డోరతి’ పై కూడా అప్‌డేట్స్ ఇచ్చింది.

ఇటీవల విడుదలైన థియేట్రికల్ ట్రైలర్‌ను గమనిస్తే ‘డోరతి’ కథలో ఇద్దరు చిన్ననాటి స్నేహితులు మధ్య ఆసక్తికరంగా సాగే ప్రయాణం కనిపిస్తోంది. గ్రామీణ తమిళనాడు నేపథ్యంలో పెరిగిన వీరి జీవితాల్లోకి డోరతి అనే అమ్మాయి ఎంటరైన తర్వాత వారి మధ్య ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి..అనే ప్రధానంశం మీద కథ నడుస్తుంది.

దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్..స్నేహం, అనుమానం, అసూయ, అపార్థాలు..ఈ అంశాలతో అద్భుతమైన స్క్రీన్ ప్లేతో డోరతి చిత్రాన్ని మన ముందుకు తీసుకురాబోతున్నట్టుగా ట్రైలర్‌ చూస్తే తెలుస్తోంది. వైల్డ్ యాక్షన్ సీన్స్ కూడా ఉన్నట్టుగా ట్రైలర్‌లో చూపించాడు కార్తీక్ సుబ్బరాజ్. గత కొంతకాలంగా కీర్తికి సరైన హిట్ దక్కడం లేదు.

అయినా, కూడా కమర్షియల్ సినిమాలతో పాటు ప్రయోగాత్మక చిత్రాలను చేస్తూ వస్తోంది. మరి, ఇకనుంచైనా ఈ బ్యూటీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతుందో లేదో చూడాలి. కాగా, నాని సరసన కీర్తి చేసిన ఏషనాగుల సాంగ్ యూట్యూబ్‌లో సెన్షేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా సెప్టెంబర్ 24న పాన్ ఇండియా వైడ్‌గా థియేటర్స్‌లోకి రాబోతోంది.

#Keerthy Suresh#Dorathi#Karthik Subbaraj#Kollywood
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి