Rashmika Mandanna: కన్నడ బ్యూటీ రష్మిక మందన్న తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను పర్‌ఫెక్ట్ కాదని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంతకీ, ఆమె ఏ విషయంలో ఇలా మాట్లాడిందీ అంటే భాష విషయంలో. మాతృ భాష కాకుండా మిగతా భాషలలో సినిమాలు చేస్తున్న రష్మిక కెరీర్ ప్రారంభ రోజులను గుర్తు చేసుకొని ఇలా చెప్పుకొచ్చింది. నాకు ఏ భాష అంతగా రాదని ఓపెన్‌గా చెప్పింది.
ఏ భాషలో సినిమా చేస్తే అదే భాషలో డైలాగ్స్ చెప్పడానికి ప్రయత్నించాను. ఆ సమయంలో నా యాస చూసి చాలామంది నన్ను కామెంట్స్ చేశారు. అయినా, కూడా అభిమనులు నన్ను ఆదరించి ఇంత క్రేజ్..పాపులారిటీని తెచ్చిపెట్టారు. ఇందుకు, వారందరికీ నేనుప్పుడు రుణపడి ఉంటానని రష్మిక తెలిపింది. ఇక, తన యాస విషయంలో వచ్చే ట్రోల్స్ చూసి నవ్వుకుంటానని కూడా ఆమె తెలిపింది.
ఎవరు ఎలా కామెంట్ చేసినా, ట్రోల్స్ చేసినా ప్రేక్షకులను కలిసినప్పుడు మాత్రం వారిని ఆ భాషలోనే మాట్లాడించేదాన్ని అని చెప్పుకొచ్చింది. అలా, నేను గౌరవించాను అని కూడా ఈ సందర్భంగా రష్మిక తెలిపింది. తన అభిమానులే..తెలుగు, హిందీ భాషలలో సినిమాలు చేయాలని కోరినట్టుగా చెప్పింది రష్మిక. అనవసరమైన విమర్శలతో ఏకాగ్రత కోల్పోయి సెట్స్‌కి వెళ్ళనని చెప్పుకొచ్చింది.
రష్మిక చేస్తున్న సినిమాలు:
ప్రస్తుతం, రష్మిక మందన్న తన భర్త విజయ్ దేవరకొండతో కలిసి ఇటీవలే రణబాలి షూటింగ్‌ను పూర్తి చేసింది. ఈ అక్టోబర్ 16న పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ కాబోతోంది. మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమాకి రాహుల్ సాంకృత్యన్ దర్శకుడు. అలాగే, మైసా అనే మరో పాన్ ఇండియా సినిమాను చేస్తోంది. వీటితో పాటు కొత్తగా కర్ణాటక సంగీత విధ్వాంసురాలు, లెజండరీ గాయనీ, ఎం.ఎస్.సుబ్బులక్ష్మి బయోపిక్‌లో నటించబోతోంది. పెళ్లి తర్వాత గ్లామర్ రోల్స్‌కి గుడ్ బై చెప్పినట్టుగా ఇటీవల వార్తలు వచ్చాయి.











