సినిమా

Vishwambhara: నష్టాల్లో యు.వి క్రియేషన్స్‌..విశ్వంభర VFX కి బడ్జెట్ లేదా?

రచన: Anshu4 నిమిషాల పఠనం

Vishwambhara: మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వీటిలో ఒకటి ఎప్పుడో మొదలైన ‘విశ్వంభర’ చిత్రం కాగా, రెండో సినిమా ఈ ఏడాది షూటింగ్ ప్రారంభం అయిన ‘కాకా’. ఈ రెండు సినిమాల విడుదల తేదీలపై గత కొన్నిరోజులుగా రక రకాల వార్తలు వచ్చి అభిమానులను కన్‌ఫ్యూజ్ చేస్తున్నాయి. ‘కాకా’ రిలీజ్ విషయంలో క్లారిటీ ఉంది గానీ, ‘విశ్వంభర’ మాత్రం ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆగిందని సమాచారం.

దర్శకుడు బాబీ కొల్లి రూపొందిస్తున్న ‘కాకా’ మూవీని వచ్చే ఏడాది జనవరి 13న సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించి పోస్టర్ కూడా వదిలారు. అయితే, అదే సమయంలో మల్లిడి వైశిష్ట తెరకెక్కిస్తోన్న ‘విశ్వంభర’ కూడా సంక్రాంతి బరిలో విడుదల అయ్యే అవకాశం ఉందన్న ప్రచారం బాగా జరుగుతోంది. కానీ, ఈ విషయంలో నిర్మాణ సంస్థ నుంచి మాత్రం ఇప్పటివరకు ఏ స్పష్టత రాలేదు.

ఇక, తాజాగా దర్శకుడు వశిష్ఠ ‘విశ్వంభర’ గురించి చేసిన ఓ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ గా మారింది. శివుడికి సంబంధించిన ఒక ప్రవచనం వీడియోను ఎక్స్ లో షేర్ చేశారు. ఈ సినిమా విడుదల సందిగ్ధంలో ఉందనే, వశిష్ఠ ఈ పోస్ట్ పెట్టాడని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే, ఇటీవల నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ డెబ్యూ మూవీని ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి, ‘విశ్వంభర’ చిత్రాన్ని పక్కన పెట్టి మోక్షజ్ఞ సినిమాపై వర్క్ చేస్తున్నాడట.

అయితే, ఇప్పుడు వినిపిస్తున్న దాని ప్రకారం నిర్మాణ సంస్థ యూవీ సంస్థలో ఇటీవల చేసిన సినిమాలు బాగా నష్టాలను తెచ్చిపెట్టడంతో కొంత ఆర్ధిక ఇబ్బందులో ఉందట. ఈ కారణం వల్లనే ‘విశ్వంభర’ చిత్రానికి సంబందించిన వీఎఫ్ఎక్స్ వర్క్ కోసం కావాల్సిన బడ్జెట్‌ను ఇప్పుడు పెట్టే స్థాయిలో లేదట. అందుకే, ‘విశ్వంభర’ ఆలస్యం అవుతున్నట్టుగా ఇన్‌సైడ్ టాక్. ఈ విషయంలో మెగాస్టార్ ఏమైనా చొరవ తీసుకుంటే గానీ ప్రాజెక్ట్ ముందుకు కదిలే పరిస్థితి లేదంటున్నారు. అందుకే, ‘విశ్వంభర’ విషయంలో ఏమీ చేయలేక వశిష్ఠ ఇలా పోస్ట్ పెట్టినట్టుగా చెప్పుకుంటున్నారు.

#Vishwambhara#Megastar Chiranjeevi#Trisha#Aashika Ranganath#Mallidi Vassishta
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి