వైరల్ న్యూస్

VIRAL: అమానుషం.. మహిళను జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన కానిస్టేబుల్!

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

హైదరాబాద్‌లోని హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్‌ ఆవరణలో అత్యంత అమానుషమైన సంఘటన చోటుచేసుకుంది. ఓ సామాన్య మహిళ పట్ల గవర్నమెంట్ రైల్వే పోలీస్ (RPF) కానిస్టేబుల్ ఒకరు విచక్షణారహితంగా ప్రవర్తిస్తూ, తీవ్ర దౌర్జన్యానికి దిగాడు. రైల్వే స్టేషన్‌ ప్రాంగణంలోని ఒక దుకాణం వద్ద నిలబడి ఉన్న సదరు మహిళపై కానిస్టేబుల్ ఒక్కసారిగా విరుచుకుపడి దాడి చేశాడు. ఈ హఠాత్ పరిణామంతో అక్కడున్న ప్రయాణికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

 ఘటనా స్థలంలో బాధితురాలి భర్త ఎంతగానో ప్రాధేయపడినా, సదరు పోలీసు ఏమాత్రం కనికరం చూపకుండా పైశాచికత్వం ప్రదర్శించాడు. అందరూ చూస్తుండగానే సదరు మహిళను కొడుతూ, ఆమె జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ రైల్వే పోలీస్ స్టేషన్ వైపు లాక్కెళ్లాడు. ఈ దృశ్యాలను అక్కడున్న కొందరు ప్రయాణికులు తమ ఫోన్లలో చిత్రీకరించడంతో ఈ దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది.

 అయితే, కానిస్టేబుల్ ఆ మహిళతో ఆ విధంగా ఎందుకు ప్రవర్తించాడనేది తెలియాల్సివుంది. సదరు మహిళ ఏదైనా కేసులో నిందితురాలా? లేక ఇతర వ్యక్తిగత కారణాలు ఉన్నయా? అనేది తేలాల్సి వుంది. ఏది ఏమైనా ఈ అమానుష చర్యకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వ్యాపించడంతో ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా రక్షణ చూడాల్సిన పోలీసు అధికారి, ఒక మహిళ పట్ల ఇలా అనాగరికంగా, పశువులా వ్యవహరించడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 ఇలా విచక్షణారహితంగా దాడి చేసిన సదరు కానిస్టేబుల్‌పై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు, హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సదరు వీడియో వైరల్‌గా మారడంతో రైల్వే ఉన్నతాధికారులు ఏవిధంగా స్పందిస్తారో చూడాల్సివుంది. బాధ్యుడైన పోలీస్ కానిస్టేబుల్‌పై శాఖాపరమైన విచారణకు ఆదేశించి, తక్షణమే సస్పెన్షన్ వేటు వేసేందుకు విధించాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. శాంతిభద్రతలను కాపాడాల్సిన వారే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని మహిళలతో ఇలా ప్రవర్తించడం పట్ల ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

#HafizpetRailwayStation#HyderabadNews#RailwayPoliceAssault#RPFConstable#PoliceBrutality#TelanganaPolice#CrimeNewsTelugu
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి