Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిని అభిమానించే ఏ ఒక్కరైనా, ఆయన ఆశీస్సులు కావాలని కోరుకుంటారు. ఇప్పుడు, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఈ జనరేషన్ నటీనటులందరికీ.. చిరు ఓ డిక్షనరీ. ఇక, కొత్తగా సినీ రంగానికి వచ్చి, విజయాలను అందుకుంటున్న వారిని చూస్తే, పిలిచి మరీ అభినందిస్తుంటారు. మెగాస్టార్ కోసం ఎంతో మంది వేయి కళ్ళతో ఎదురుచూస్తుంటారు.
ఇక, యంగ్ జనరేషన్ హీరోలైతే తమ సినిమా రిలీజ్ సమయంలో, అన్నయ్య ఆశిస్సులతో పాటు అభిమానాన్ని పొందుతున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి, చిరుని గెస్ట్ గా పిలిచుకుంటున్నారు. అలా, వచ్చిన చిరు.. స్టేజ్ మీద తన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, సినిమాకి కావాల్సిన ప్రమోషన్స్ చేస్తూ ఉత్సాహపరుస్తున్నారు. ఇప్పుడు కూడా యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన చెన్నై లవ్‌స్టోరీ సినిమా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు.
ఈ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన చిరు, ఈ టైటిల్ వినగానే నాకు చెన్నైలోని మధుర జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి అంటూ ఆసక్తికరంగా మాట్లాడారు. ఎస్.కె.ఎన్, సాయి రాజేష్, మైత్రీ మూవీ మేకర్స్ అలాగే, హీరోహీరోయిన్ ని చిరు అభినందించారు..సినిమా పెద్ద సక్సెస్ కావాలని దీవించారు. మొత్తానికి, చెన్నై లవ్‌స్టోరీ సినిమా ఈవెంట్ కి చిరు రావడం అందరికీ ఎనలేని ఆనందాన్ని కలిగించింది.
ఇక, మెగాస్టార్ సినిమాల విషయానికొస్తే..ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ మాస్ ఎంటర్‌టైనర్ చేస్తున్నాడు. హీరోయిన్‌గా ప్రియమణి, కీలక పాత్రలో అనస్వర రాజన్ నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా సినిమా షూటింగ్ జరుగుతోంది. దీని, తర్వాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఓ సినిమాను చేయాల్సి ఉంది. ఈ సినిమాను నేచురల్ స్టార్ నాని నిర్మించబోతున్నాడు.












