National

Breaking: పేపర్ లీక్స్​పై ప్రధాని మోదీ కీలక ప్రకటన.. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు!

రచన: Mamatha puppala5 నిమిషాల పఠనం

దేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనలు, పార్లమెంట్‌లో ప్రతిపక్షాల నిరసనలతో రాజకీయ వాతావరణం అత్యంత వేడెక్కిన వేళ ప్రధాని నరేంద్ర మోదీ దేశ యువతను ఉద్దేశించి ఒక కీలక ప్రకటన చేశారు. వివిధ ప్రవేశ, పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీకి పాల్పడిన బాధ్యులపై వేగవంతమైన విచారణ జరిపి కఠినంగా శిక్షించేందుకు ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు 'ఎక్స్' (X) వేదికగా ఈ విషయాన్ని తెలిపారు.

దేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనలు, పార్లమెంట్‌లో ప్రతిపక్షాల నిరసనలతో రాజకీయ వాతావరణం అత్యంత వేడెక్కిన వేళ ప్రధాని నరేంద్ర మోదీ దేశ యువతను ఉద్దేశించి ఒక కీలక ప్రకటన చేశారు. వివిధ ప్రవేశ, పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీకి పాల్పడిన బాధ్యులపై వేగవంతమైన విచారణ జరిపి కఠినంగా శిక్షించేందుకు ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు 'ఎక్స్' (X) వేదికగా ఈ విషయాన్ని తెలిపారు.

ఈరోజు (గురువారం) ఉదయం ఈ విషయాన్ని పంచుకున్న ప్రధాని.. దేశ యువత భవిష్యత్తు, సంక్షేమం కంటే తమకు వేరే ఏదీ ముఖ్యం కాదని స్పష్టం చేశారు. పేపర్ లీక్‌లకు పాల్పడిన వారికి వేగంగా, అత్యంత కఠినమైన శిక్ష పడేలా చూసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని ప్రధాని పేర్కొన్నారు. ఈ విషయమై తక్షణమే తగిన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను, విభాగాలను ఆదేశించినట్లు చెప్పారు.

విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు తమ ప్రభుత్వం వరుసగా తీసుకుంటున్న నిర్ణయాల్లో ఇది ఒక భాగమని వెల్లడించారు. మన యువత భవిష్యత్తుతో ఆడుకోవడానికి లేదా హాని తలపెట్టడానికి ప్రయత్నించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని ప్రధాని మోదీ గట్టి హామీ ఇచ్చారు.
https://x.com/narendramodi/status/2080135258142617785?s=20
ఒకవైపు ప్రధాని మోదీ ఈ కీలక ప్రకటనలు చేస్తుండగా, మరోవైపు దేశ రాజధానిలో యువత, విద్యార్థుల ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. 'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేపీ) ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులు, రాజకీయ నాయకులు కలిసి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన ప్రదర్శనను కొనసాగిస్తున్నారు. ప్రధాని హామీలు ఒకవైపు ఉన్నప్పటికీ, రహదారుల దిగ్బంధం, నిరసనలతో ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
చంద్రశేఖర్ ఆజాద్ జయంతి సందర్భంగా నివాళులు

మరోవైపు, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, విప్లవ వీరుడు చంద్రశేఖర్ ఆజాద్ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. హిందూస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్‌లో కీలక పాత్ర పోషించి, బ్రిటిష్ పాలకులను నిలదీస్తూ కోట్లాది మందిలో స్వాతంత్ర్య కాంక్షను రగిలించిన ఆజాద్ మహనీయుడన్నారు.
భయం ఎరుగని ధైర్యసాహసాలు, నిరుపమాన దేశభక్తి భారత చరిత్రలో గర్వకారణంగా నిలిచాయని కొనియాడారు. అసంఖ్యాకమైన భారతీయ యువత తమ జీవితాలను దేశసేవకు అంకితం చేసేలా ఆజాద్ స్ఫూర్తినింపారని, ఆయన దృఢ సంకల్పం రాబోయే తరాలకు నిరంతరం మార్గదర్శకంగా ఉంటుందని కొనియాడారు.
https://x.com/narendramodi/status/2080111667392975331?s=20


#Paper Leaks#Narendra Modi#Fast Track Courts#Chandrashekhar Azad#CJP Protest#Delhi Protests
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి