Balakrishna: గాడ్ మాసెస్ నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా భారీ యాక్షన్ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకి దర్శకుడు గోపిచంద్ మలినేని. ఇంతకముందు వీరి కాంబినేషన్లో వీరసింహా రెడ్డి వచ్చి మంచి కమర్షియల్ సక్సెస్‌ను అందుకుంది. దీని, తర్వాత చేస్తున్న సినిమా ఎన్‌బికే 111 కావడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. అంతేకాదు, మరీ ముఖ్యంగా బాలయ్యని ఒక స్టైలిష్ గ్యాంగ్ స్టర్ పాత్రలో ప్రెజెంట్ చేస్తుండడంతో ఆ హైప్ మరింత పెరిగింది.
అయితే, ఇటీవల ఈ సినిమా టైటిల్ ఇదేనంటూ రెండు టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. వాటిలో 'దాదా' ఒకటి. తాజాగా, మేకర్స్ సినిమా టైటిల్ తో పాటు గ్లింప్స్ ని కూడా విడుదల చేసారు. ఎన్‌బికే 111 సినిమాకి "దాదా" అంటూ మాస్ టైటిల్ ని ఫిక్స్ చేసి బాలయ్య కొత్త లుక్ ని రిలీజ్ చేశారు. ఇక, తాజా గ్లింప్స్ లో సాలిడ్ మ్యానరిజంలు..సెటిల్డ్ మాస్ డైలాగ్స్ తో అదరగొట్టాడు.
ఇది నందమూరి ఫ్యాన్స్ కి సాలీడ్ ట్రీట్ అని చెప్పాలి. ఇక, థమన్ కూడా బాలయ్యకి మరోసారి అద్భుతమైన బీజిఎం అందించాడు. కాగా, ఈ చిత్రాన్ని మేకర్స్ ఇదే ఏడాది డిసెంబర్ 24న గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. వృద్ది సినిమాస్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇటీవల గాయం కారణంగా కొన్నాళ్ళు బాలయ్య రెస్ట్ తీసుకున్నాడు. దాంతో, ఈ 'దాదా' వచ్చే ఏడాది వస్తాడని అందరూ అనుకున్నారు.
కానీ, ఇటీవల మళ్ళీ సెట్స్‌లో జాయిన్ అయ్యాడు బాలయ్య. జెట్ స్పీడ్‌లో షూటింగ్ జరుగుతోంది. ఒకవైపు షూటింగ్..ఇంకోవైపు పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ ని మేకర్స్ పూర్తి చేస్తున్నారు. అంతేకాదు, బాలయ్య తన పాత్రకి సంబందించిన డబ్బింగ్ కార్యక్రమాలను కూడా ఇంటి నుంచే పూర్తి చేసేస్తున్నాడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో భారీ యాక్షన్ సినిమాను చేయనున్నాడు బాలయ్య.








