Nandamuri Mokshagna: గాడ్ మాసెస్ నట సింహం నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ డెబ్యూ సినిమాను ప్రకటించారు. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ డెబ్యూ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతోంది. ఇక, ఈ సినిమాను బింబిసార చిత్రంతో నందమూరి కళ్యాణ్ రామ్ కి బ్లాక్ బస్టర్ ఇచ్చిన మల్లిడి వశిష్ఠ తెరకెక్కించబోతున్నాడు.
గత నాలుగైదేళ్ళ నుంచి నందమూరి వారసుడి ఎంట్రీ సినిమా గురించి ఎన్నో వార్తలు..రక రకాల ప్రచారాలు జరిగిన సంగతి తెలిసిందే. బాలయ్య కూడా చాలా సినిమా ఈవెంట్స్‌లో మోక్షజ్ఞ డెబ్యూ సినిమా గురించి హైప్ ఇస్తూ అద్భుతమైన కథలను సిద్ధం చేసినట్టుగా చెప్పాడు. అంతేకాదు, ఒకదశలో బాలయ్యే తన కొడుకుని పరిచయం చేస్తాడనే మాట కూడా వినిపించింది.
ఆ తర్వాత, గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమా లాంటి సినిమాతో బాలయ్యకి కెరీర్‌లో మైల్ స్టోన్ సినిమాగా నిలిచిపోయే హిట్ ఇచ్చిన క్రిష్ దర్శకత్వంలో మోక్షజ్ఞ మొదటి సినిమా తెరకెక్కుతుందని అన్నారు. ఆ తర్వాత యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కూడా సినిమా మొదలైందని..అవుట్‌పుట్ పరంగా బాలయ్యకి సంతృప్తి కలగక ఆపేసినట్టుగా చెప్పుకున్నారు. ఇన్ని, గందరగోళాల మధ్య మోక్షజ్ఞ మొదటి సినిమా అసలు ఉటుందా? హీరోగా అతనికి ఆసక్తి ఉందా? ఇలాంటి సందేహాలు కలిగాయి.
ఇప్పుడు అందరికీ షాకిచ్చిన నందమూరి వంశం:
ఇంతకాలం నుంచి వస్తున్న రూమర్స్ అన్నిటికీ నందమూరి హీరోలు బిగ్ షాకిచ్చారు. తాజాగా, మోక్షజ్ఞ ఎంట్రీ సినిమాను ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ అఫీషియల్‌గా పోస్టర్‌ను రిలీజ్ చేశారు. మల్లిడి వశిష్ఠ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం వశిష్ఠ మెగాస్టార్‌తో విశ్వంభర సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమా రిలీజైయ్యాక మోక్షజ్ఞ సినిమా పట్టాలెక్కనుంది.









