క్రైమ్

ఆన్‌లైన్ గేమ్స్ వ్యసనం.. అప్పుల పాలై దంపతుల బలవన్మరణం!

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనం మరో రెండు ప్రాణాలను బలితీసుకున్న అత్యంత విషాదకర సంఘటన నంద్యాల జిల్లాలో వెలుగుచూసింది. గేమ్స్ ఆడటం సరదాగా మొదలై చివరకు అది ప్రాణాంతక వ్యసనంగా మారడంతో, చేసిన అప్పులు తీర్చలేక ఓ దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన గోస్పాడు మండలం సాంబవరం గ్రామంలో చోటుచేసుకోగా, స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనం మరో రెండు ప్రాణాలను బలితీసుకున్న అత్యంత విషాదకర సంఘటన నంద్యాల జిల్లాలో వెలుగుచూసింది. గేమ్స్ ఆడటం సరదాగా మొదలై చివరకు అది ప్రాణాంతక వ్యసనంగా మారడంతో, చేసిన అప్పులు తీర్చలేక ఓ దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన గోస్పాడు మండలం సాంబవరం గ్రామంలో చోటుచేసుకోగా, స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

సాంబవరం గ్రామానికి చెందిన శేషాద్రి, ఆయన భార్య అంజిత ఇద్దరూ ఇంట్లోనే నివాసముంటున్నారు. అయితే శేషాద్రి ఆన్‌లైన్ గేమింగ్‌కు తీవ్రంగా బానిసయ్యాడు. రోజురోజుకూ ఆటలో డబ్బులు పోగొట్టుకుంటూ, అప్పులు చేస్తూ వచ్చాడు. బంధువులు, తెలిసిన వారి వద్ద పెద్ద మొత్తంలో అప్పులు తెచ్చి మరీ ఆన్‌లైన్ గేమ్స్ ఆడటంతో చివరికి ఆర్థిక పరిస్థితి చేయి దాటిపోయి భారీ అప్పుల ఊబిలో కూరుకుపోయాడు.

అప్పుల భారాన్ని తట్టుకోలేక భార్య అంజిత వద్ద ఉన్న బంగారు ఆభరణాలను సైతం తాకట్టు పెట్టారు. వచ్చిన డబ్బులతో రుణదాతలకు కొంత చెల్లించినప్పటికీ, తీర్చాల్సిన బాకీలు అంతకంతకూ పెరుగుతూనే వచ్చాయి. అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడం, వేధింపులు ఎక్కువ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ దంపతులు, ఇంట్లోనే సీలింగ్‌కు చీరతో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు.

రోజంతా ఇంటి తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన పొరుగువారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు పగులగొట్టి చూడగా దంపతులిద్దరూ మృతి చెంది వేలాడుతూ కనిపించారు. పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. ఉపాధి పొంది సంతోషంగా జీవించాల్సిన యువ జంట ఆన్‌లైన్ బెట్టింగ్‌ల బారిన పడి ప్రాణాలు వదలడంతో ఆ గ్రామంలో తీవ్ర శోకఛాయలు అలముకున్నాయి.

#OnlineGamingAddict#SuicideIncident#NandyalNews#Gospadu#APNewsTelugu#CrimeNewsTelugu#GamingAddiction
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి